ప్రతిపక్షంలో ఉండగా అనేకసార్లు ఎన్నికల్ని బహిష్కరించిన వైకాపాకు.. తెదేపా గురించి మాట్లాడే హక్కు ఎక్కడిదని రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిలదీశారు. మూడేళ్లు అసెంబ్లీని బహిష్కరించటంతోపాటు 2013లో ఎమ్మెల్సీ ఎన్నిక, కొన్ని జిల్లాల్లో సహకార ఎన్నికలు, 2015లో ప్రకాశం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నిక, 2018లో తెలంగాణ ఎన్నికలను వైకాపా బహిష్కరించిందని ఆయన మండిపడ్డారు.
9 ఏళ్ళుగా సీబీఐ విచారణను కూడా బహిష్కరిస్తున్న విజయసాయి రెడ్డి, ఇప్పుడు బిల్డప్ ఇవ్వటం అసహ్యంగా ఉంటుందని ట్విట్టర్లో దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: