ETV Bharat / city

ఓటుకు నోటు కేసులో సెబాస్టియన్​ డిశ్చార్జ్​ పిటిషన్ కొట్టివేత

ఓటుకు నోటు కేసులో నిందితుడు సెబాస్టియన్​ దాఖలు చేసిన డిశ్చార్జ్​ పిటిషన్​ను తెలంగాణ ఏసీబీ కోర్టు కొట్టేసింది. ఈ కేసులో ఇప్పటికే... సండ్ర వెంకటవీరయ్య, ఉదయ్​ సింహాల పిటిషన్లను కూడా నిరాకరించింది. విచారణను న్యాయస్థానం ఈ నెల 8కి వాయిదా వేసింది.

acb-court-dismiss-sebastian-discharge-petition-in-vote-for-note-case
ఓటుకు నోటు కేసులో సెబాస్టియన్​ డిశ్చార్జ్​ పిటిషన్ కొట్టివేత
author img

By

Published : Dec 2, 2020, 10:52 PM IST

ఓటుకు నోటు కేసు నుంచి సెబాస్టియన్​ను తొలగించేందుకు తెలంగాణ ఏసీబీ న్యాయస్థానం నిరాకరించింది. సెబాస్టియన్ దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్​ను కొట్టేసింది. ఓటుకు నోటు వ్యవహారంతో తనకు సంబంధం లేదని... ఏసీబీ అనవసరంగా ఇరికించిందని సెబాస్టియన్ వాదించగా... ఆయన ప్రమేయంపై పూర్తి ఆధారాలున్నాయని అనిశా వివరించింది.

ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం... సెబాస్టియన్ అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ కేసులో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సింహ డిశ్చార్జ్ పిటిషన్లను కూడా న్యాయస్థానం ఇప్పటికే కొట్టేసింది. అభియోగాల నమోదు ప్రక్రియ ప్రారంభించేందుకు విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి

'దివ్యాంగులకు మంత్రి వెల్లంపల్లి క్షమాపణ చెప్పాలి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.