కరోనా నివారణ, సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సీఎం సహాయనిధికి రూ. 1 కోటి విరాళం ఇచ్చింది. ఆర్టీజీఎస్ ద్వారా జమ చేసిన వివరాలను ఏసీఏ అధ్యక్షులు శరత్ చంద్రారెడ్డి ముఖ్యమంత్రి జగన్కు అందజేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ గ్యాస్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ కోటి రూపాయలు అందజేసింది. సంస్థ ఎండీ వెంకటేశ్వరరెడ్డి ఈ చెక్కును సీఎంకు అందించారు.
ఇవీ చదవండి.. అత్యవసర మందులతో.. విజయవాడకు ఎయిర్ ఇండియా విమానం!