ఐపీఎస్ అధికారి ఎ.బి.వెంకటేశ్వరరావు సస్పెన్షన్ అంశంపై సుప్రీంలో విచారణ జరిగింది. ఒక టెండర్ ప్రాసెస్ విధానంపై గతేడాది ఫిబ్రవరి 8న సస్పెన్షన్ చేసినట్లు ప్రభుత్వం న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. ఛార్జిషీట్ వేసి దర్యాప్తు ప్రారంభించినట్లు న్యాయవాది చందర్ ఉదయ్ సింగ్ తెలిపారు.
ఏడాదిగా సస్పెన్షన్ ఎలా కొనసాగుతుందని జస్టిస్ ఖాన్ విల్కర్ ప్రశ్నించారు. అఖిల భారత సర్వీసు నిబంధనల ప్రకారమే కొనసాగుతోందని న్యాయవాది వివరించారు. సమయమిస్తే ఎల్లుండి నిబంధనల ప్రతిని అందజేస్తామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు నిబంధనల కాపీతో రావాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. జస్టిస్ ఎ.ఎం.ఖాన్ విల్కర్, జస్టిస్ దినేష్ మహేశ్వరి ధర్మాసనంలో విచారణ జరిగింది.
దేశ, రాష్ట్ర భద్రతా వ్యవహారాలను పక్కన బెట్టి దేశద్రోహానికి పాల్పడ్డారని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును సర్వీసు నుంచి సస్పెండ్ చేసింది. ఈ అంశంపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.
ఇదీ చదవండి: