డీఈడీ కాలేజీల్లో స్పాట్ ఆడ్మిషన్ల వ్యవహారంపై దాఖలైన అప్పీళ్ల విచారణ సందర్భంగా హైకోర్టులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కోర్టు ప్రారంభ సమయంలో కొన్ని కళాశాలల యాజమాన్యాల తరపు న్యాయవాది వ్యక్తిగత కారణంతో విచారణను వాయిదా వేయాలని ధర్మాసనాన్ని కోరారు. ఈ సందర్భంలో కరోనా సోకీ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ.. ఆక్సీమీటర్ తగిలించుకొని, చేతికి సెలైన్ సీసా ట్యూబులతో ఉన్న అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలో పాల్గొన్నారు.
కరోనాతో మరణశయ్యపై ఉన్నానని.. బహుశా ఈ కేసులో వాదన వినిపించే అవకాశం వస్తుందో రాదో తెలీదన్నారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం స్పందిస్తూ.. ప్రస్తుతం కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదని ఏఏజీకి ధైర్యం చెప్పింది. కరోనా నుంచి కోలుకొని తిరిగొచ్చి తమముందు తప్పక వాదనలు వినిపిస్తారని ధైర్యం చెప్పింది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చి.. ఆప్పీళ్లపై విచారణను ఈనెల 16కు వాయిదా వేసింది.
ఇదీ చదవండి: