ఫోన్ అతిగా మాట్లాడొద్దని తల్లి మందలించడంపై.. తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువతి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగింది పామేనా గ్రామానికి చెందిన సుప్రియా (19) మొయినాబాద్‌లోని ఓ కళశాలలో బీఫార్మసీ మొదటి సంవత్సరం చదువుతోంది.
బుధవారం మధ్యాహ్నం.. కూతురు ఫోన్ మాట్లాడుతుండటం గమనించిన తల్లి.. ఆమెను మందలించింది. అప్పుడప్పుడు కాస్త చదువు మీద కూడ శ్రద్ధ పెట్టాలని సూచించింది. మనస్థాపానికి గురైన సుప్రియ.. గదిలోకి వెళ్లి చీరతో ఫ్యానుకు ఉరేసుకుంది. కూతురి మరణంతో.. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇదీ చదవండి: