భర్త వేధింపులు భరించలేక ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో జరిగింది. శంషాబాద్‌లో నివాసం ఉంటున్న లావణ్య ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తోంది. ఆమె భర్త వెంకటేశ్వరరావు ప్రైవేట్ ఎయిర్వేస్లో పైలెట్‌గా పనిచేస్తున్నారు. వీళ్లు ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కొద్ది రోజులుగా భర్త వేధిస్తున్నాడని మనోవేదనకు గురైన లావణ్య ఇంట్లోనే గురువారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
చనిపోయే ముందు ఫేస్బుక్లో తన బాధను స్నేహితులతో పంచుకుంది. ఇష్టంగా ప్రేమించిన వ్యక్తే వేధించడం, కొట్టడం బాధగా ఉందని చెప్పింది. "అమ్మా.. నాన్నా.. ఇక నేను బతకలేను. నన్ను క్షమించండి. మీరు నన్ను ఎంతో ప్రేమగా పెంచారు. మీకు దూరమై పోతున్నా. నా భర్తతో ఇక జీవించలేను." అంటూ చివరి మాటలు చెప్పింది లావణ్య.
లావణ్యను ఆమె భర్త వెంకటేశ్వరరావు, అత్తమామలు వేధించేవారని లావణ్య సోదరుడు ఆరోపించారు. వివాహేతర సంబంధం కొనసాగించేవాడని.. ఇదేమని ప్రశ్నిస్తే భార్యను తీవ్రంగా కొట్టేవాడని మృతురాలి తల్లిదండ్రులు వాపోయారు. లావణ్యపై చేయి చేసుకున్న దృశ్యాలు తల్లిదండ్రులు పోలీసులకు అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతురాలి భర్త వెంకటేశ్వరరావును అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
ఇదీ చదవండి: