ETV Bharat / city

అమ్మ భారమైంది.. రైలెక్కించి వదిలించుకున్నాడు.. - a son left mother at vijayawada

కని పెంచి పెద్ద చేసిన కొడుక్కి.. ఆమె అవసరం తీరిపోయింది. కోడలికి ఆమె భారమైంది. ఏదో ఓ రైలెక్కించి పంపేసి వదిలించుకున్నారు. విజయవాడ రైల్వేస్టేషన్‌కు చేరుకు‌న్న ఆ వృద్ధురాలు.. యాచకురాలిగా మారింది. తిండీ తిప్పలు లేక అనారోగ్యం పాలై బస్టాండ్‌ ఆవరణలో పడి ఉన్న ఆమెను సిబ్బంది కాపాడారు. వివరాలు కనుక్కుని సొంతఊరికి పంపే ఏర్పాట్లు చేశారు.

A mother difficulties at Vijayawada
A mother difficulties at Vijayawada
author img

By

Published : Apr 23, 2021, 11:30 AM IST

విజయవాడ బస్టాండ్​లో అమ్మ కష్టాలు

బెజవాడ బస్టాండ్​లో బిక్కుబిక్కుమంటూ దీనంగా చూస్తున్న ఈ వృద్ధురాలిది చిత్తూరు జిల్లా కుప్పం. కన్నవారు వదిలించుకోవడంతో.. కొంతకాలంగా ఈ బస్టాండే ఈమె ఆవాసమైంది. ప్రయాణికులు దయతో ఇచ్చే డబ్బుతోనే పొట్ట నింపుకుంటోంది. వయసు మీద పడి యాచించడం కూడా చేతకాని స్థితిలో ఉన్న ఈ అవ్వ.. పిల్లలు పెట్టిన కష్టాలు తలచుకుని.. ఏడవని రోజంటూ లేదు. కొన్ని రోజుల క్రితం బస్టాండ్‌కు వచ్చిన వృద్ధురాలు.. తీవ్ర జ్వరంతో లేవలేని స్థితికి చేరుకుంది. సాయం చేయాలని.. కనిపించిన వారందరినీ కన్నీటితో వేడుకుంటోంది.

వృద్ధురాలి దీనస్థితిని చూసిన ఆర్టీసీ సిబ్బంది.. ఆమెకు మందులు తెప్పించి ఇచ్చారు. అల్పాహారం తినిపించి ఆకలి తీర్చారు. కాస్త నీరసం తగ్గాక.. గద్గద స్వరంతో ఆమె చెబుతున్న వివరాలు విని ఆవేదన చెందారు. తనది చిత్తూరు జిల్లా కుప్పం అనీ.. కుమారుడిని కష్టపడి చదివించి వివాహం చేశానని ఆమె వివరించింది. తన పేరిట ఉన్న పొలాన్నీ వారికే ఇచ్చానని అవ్వ చెబుతోంది. బాగా చూసుకుంటారని ఆశిస్తే.. ఇంట్లో నుంచి వెళ్లగొట్టారని కన్నీటి పర్యంతమైంది. స్థానికంగా ఉంటే ఇబ్బందవుతుందన్న ఆలోచనతోనే ఇంత దూరం పంపేశారని అవ్వ వాపోయింది.

వృద్ధురాలి కష్టాలు తెలుసుకున్న సిబ్బంది.. మూడురోజులుగా ఆమె ఆలనాపాలన చూస్తున్నారు. రెండు రోజుల క్రితం కనీసం మాట్లాడలేని స్థితిలో ఉన్న అవ్వ పరిస్థితి ప్రస్తుతం మెరుగైంది. తన ఊరికి వెళ్లి ఏదోవిధంగా బతుకుతానని దీనంగా చెబుతోంది. కుమారుడి ఫోన్‌ నెంబర్‌ తెలీకపోవడంతో.. వారికి సమాచారం ఇవ్వడం కుదరలేదు. ఆర్టీసీ సిబ్బందే సొంత ఖర్చుతో కుప్పం పంపే ఏర్పాట్లు చేశారు.

ఇదీ చదవండి: కరోనా కలవరం: ఆక్సిజన్‌ మీదే 60% మంది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.