ETV Bharat / city

gang rape: బాలికపై 400 మంది లైంగిక దాడి.. !

మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో దారుణం జరిగింది. ఆరు నెలలుగా ఓ బాలిక(16)పై 400 మంది లైంగిక దాడికి పాల్పడ్డారు. కాపాడాల్సిన పోలీస్​ కూడా నిందితుల్లో ఒకడుగా ఉండటం గమనార్హం.

gang rape at maharashtra
మహారాష్ట్రలో బాలికపై 400 మంది లైంగిక దాడి
author img

By

Published : Nov 14, 2021, 7:22 PM IST

బాలల దినోత్సవం వేళ ఓ బాలిక(16)పై అత్యాచారం జరిగిన అమానుష ఘటన వెలుగులోకొచ్చింది. ఆరు నెలలుగా 400 మంది ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. నిందితుల్లో పోలీసు కూడా ఉన్నాడు. ఇప్పుడు ఆ బాలిక గర్భం దాల్చింది. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో జరిగింది. బాధిత బాలిక తల్లి రెండేళ్ల కింద మరణించింది. దీంతో ఆ బాలిక తండ్రి ఒక వ్యక్తితో ఆమెకు పెళ్లి చేశాడు.

ఏడాదికిపైగా అత్తవారింట ఉన్న ఆమె.. మామ వేధింపులు భరించలేక పుట్టింటికి చేరింది. కొన్ని రోజుల తర్వాత ఆ యువతి ఉద్యోగం కోసం అంబేజోగై పట్టణానికి వెళ్లింది. ఉద్యోగం ఇస్తామని నమ్మించిన ఇద్దరు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆనాటి నుంచి 400 మంది వ్యక్తులు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె ఆరోపించింది. ఇందులో ఒక పోలీస్‌ అధికారి కూడా ఉన్నట్లు తెలిపింది.

తానిప్పుడు గర్భం దాల్చినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఇప్పటి వరకు నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. మరోవైపు రెండు నెలల గర్భవతి అయిన ఆ బాలికకు అబార్షన్‌ కోసం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ తన ప్రయత్నాలను ప్రారంభించింది.

ఇదీ చూడండి: ATTACK : యువతిపై ప్రేమోన్మాది దాడి...అసలేం జరిగింది...?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.