ETV Bharat / city

తెలంగాణ: అదుపుతప్పి బావిలో పడిన జీపు.. వాహనంలో 15 మంది - రోడ్డు ప్రమాదం వార్తలు గవిచర్ల

తెలంగాణ రాష్ట్రం సంగెం మండలం గవిచర్ల వద్ద అదుపుతప్పిన జీపు... వ్యవసాయ బావిలో పడిపోయింది. జీపులో 15 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 12 మంది సురక్షితంగా బయటపడగా.. ముగ్గురు కోసం స్థానికులు, పోలీసులు గాలిస్తున్నారు.

a-jeep-fell-into-well-with-the-fifteen-passengers-in-gavicharla-of-warangal-rural-district
జీపు డ్రైవర్​కు ఫిట్స్​ రావడం వల్లే ప్రమాదం
author img

By

Published : Oct 27, 2020, 7:34 PM IST

జీపు డ్రైవర్​కు ఫిట్స్​ రావడం వల్లే ప్రమాదం

తెలంగాణ రాష్ట్రం వరంగల్‌ గ్రామీణ జిల్లా సంగెం మండలం గవిచర్ల వద్ద విషాదం చోటు చేసుకుంది. అదుపుతప్పిన జీపు వ్యవసాయ బావిలో పడిపోయింది. ఆ జీపులో 15 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదం నుంచి మొదటగా 11 మంది సురక్షితంగా బయటపడగా.. సహాయ చర్యలు చేపట్టిన అధికారులు మరొకరిని కాపాడారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మిగతావారి కోసం స్థానికులు, పోలీసులు గాలిస్తున్నారు.

బావిలో గల్లంతైన మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఏసీపీ శ్యామ్​ సుందర్​ ఆధ్వర్యంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. జీపు డ్రైవర్​కు ఫిట్స్​ రావడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. వరంగల్​ నుంచి నెక్కొండ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా నిండిన చెరువు పక్కనే బావి ఉంది.

ఇదీ చదవండి:

క్షతగాత్రుల నగదు జాగ్రత్తగా అప్పగించిన 108 సిబ్బందికి అభినందనలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.