ETV Bharat / city

హైదరాబాద్ లోని అపార్ట్‌మెంట్‌లో.. అగ్నిప్రమాదం - hyderabad fire accidents

హైదరాబాద్​లోని ఓ అపార్ట్​మెంట్​లో అగ్నిప్రమాదం జరిగింది. ఐదో అంతస్తులో మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగలు అలుముకోవడంతో.. జనం భయాందోళనకు గురయ్యారు.

హైదర్‌గుడాలోని అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

author img

By

Published : Jan 16, 2022, 3:43 PM IST

హైదరాబాద్​ హైదర్‌గుడాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఐదో అంతస్తులో మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. దట్టమైన పొగలు అలుముకోవడంతో.. మిగిలిన ప్లాట్లలో ఉన్న వారిని ఖాళీ చేయించారు.

శనివారం రాత్రి అపార్ట్​మెంట్ యజమాని రాము ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లాడని పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పిందని వెల్లడించారు. షార్ట్​సర్క్యూట్ వల్లే అగ్నిప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. భవనానికి అగ్ని ప్రమాదాల నివారణ వ్యవస్థ సక్రమంగా లేదని.. స్థానికులు తెలిపారు. మంటలకు ప్లాట్ గోడలు పూర్తిగా దెబ్బతిన్నాయని.. ఇంట్లోని సామగ్రి పూర్తిగా దగ్ధమైందని వెల్లడించారు.

ఇదీ చూడండి: Fire Accident in Military Club: సికింద్రాబాద్‌ క్లబ్‌లో అగ్నిప్రమాదం.. రూ.కోట్లలో ఆస్తినష్టం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.