Yadadri Parking Fee: యాదాద్రి కొండపైకి ఆదివారం (మే1) నుంచి భక్తుల వాహనాలను అనుమతించాలని యాదాద్రి ఆలయ అధికారులు నిర్ణయించారు. అయితే.. కొండపైకి అనుమతించే వాహనాలకు పార్కింగ్ రుసుం వసూల్ చేయనున్నారు. కొండపైకి వచ్చే వాహనాలకు గంటకు రూ.500 రుసుం విధించనున్నారు. గంట సమయం తర్వాత ప్రతి గంటకు అదనంగా రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రోటోకాల్, దాతల వాహనాలకు ప్రవేశ రుసుం నుంచి మినహాయింపు ఇచ్చారు. ఆదివారం నుంచే వాహనాలకు నిర్ణయించిన ప్రవేశ రుసుం అమలవుతుందనిఆలయ ఈవో గీత తెలిపారు.
ఇదిలా ఉండగా... లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తుల వాహనాలను కొండపైకి అనుమతించాలని గత కొంత కాలంగా ఆందోళన కొనసాగుతున్న విషయం తెలిసిందే. కొండపైకి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా తరలించనున్నట్లు ఆలయ ఈవో గీతారెడ్డి ఇదివరకే వెల్లడించారు. కేవలం ఆర్టీసీ బస్సుల ద్వారా కొండపైకి భక్తుల తరలించనున్నట్లు తెలిపారు. భక్తుల తరలింపునకు అయ్యే వ్యయం ఆలయమే భరిస్తుందని ఈవో చెప్పారు. అయితే తాజా నిర్ణయంతో వాహనాలకు పార్కింగ్ ఫీజు వసూలు చేయాలని నిర్ణయించారు.
ఇవీ చూడండి: