- "సర్కారు వారి సినిమా"కు.. హైకోర్టు చెక్!
"సర్కారు వారి సినిమా"కు న్యాయస్థానం చెక్ పెట్టింది. సినిమా టికెట్లను ఆన్ లైన్లోనే విక్రయిస్తామంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓను.. హైకోర్టు నిలిపేసింది. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 69ని సవాల్ చేస్తూ.. బిగ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేటు లిమిటెడ్, ఎగ్జిబిటర్లు దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం.. జీఓ అమలుపై స్టే విధించింది.
- సీఐడీ వికృత చేష్టలు పరాకాష్ఠకు చేరాయి: చంద్రబాబు
రాష్ట్రంలో సీఐడీ వికృత చేష్టలు పరాకాష్టకు చేరాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పోలీసులు కూడా సైకోలుగా తయారవుతున్నారా? అని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. తమ పోరాటం పోలీసులపై కాదని.. వైకాపా పైనే అని స్పష్టం చేశారు. తప్పుడు అధికారులను వదిలిపెట్టనని తేల్చిచెప్పారు. మళ్లీ అధికారంలోకి రాబోయే పార్టీ తెలుగుదేశమే అన్న విషయం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.
- వైకాపా ప్లీనరీలో.. జనం బయటకు వెళ్లకుండా ఏం చేశారంటే..?
అసలే అధికార పార్టీ ప్లీనరీ.. సక్సెస్ చేయడానికి నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. జనం మధ్యలో వెళ్లిపోతే ఎలా అనుకున్నారేమో.. వెంటనే పకడ్బందీ వ్యూహం వేశారు. సమావేశం ముగిసే వరకూ ఎవరూ బయటకు వెళ్లకుండా సమావేశ హాలు గేట్లకు తాళం వేసేశారు. అల్లూరి జిల్లా పాడేరులో వైకాపా ప్లీనరీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
- 'ఐదుగురి మరణాలకు ఉడతే కారణం'.. గోప్యంగా పోస్టుమార్టం నివేదిక !
శ్రీ సత్యసాయి జిల్లాలో గురువారం ఐదుగురు కూలీలు సజీవ దహనమైన ఘటనలో ఉడత కళేబరానికి పరీక్షలు పూర్తి చేశారు. తాడిమర్రి పశువైద్యశాలలో పరీక్షలు చేసిన పశువైద్యులు.. నివేదిక వివరాలను గోప్యంగా ఉంచారు. చిల్లకొండయ్యపల్లి వద్ద నిన్న ఉదయం విద్యుత్త తీగ తెగి ఆటోపై పడిన దుర్ఘటనలో ఐదుగురు బుగ్గిపాలైన విషయం తెలిసిందే.
- 'మోదీ పర్యటన.. 4వేల మందితో బందోబస్తు'
ఈ నెల 3న తెలంగాణలోని హైదరాబాద్‌లో జరగనున్న భారతీయ జనతా పార్టీ సంకల్ప సభ అనంతరం ప్రధాని మోదీ రాజ్‌భవన్‌లో బస చేస్తారని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఇందుకోసం రాజ్‌భవన్ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ మేరకు భాజపా నేతలతో కలిసి ఆయన పరేడ్ గ్రౌండ్స్‌లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
- నుపుర్ శర్మ.. 'దేశానికి క్షమాపణ చెప్పాల్సిందే!'
మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భాజపా మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. ఓ పార్టీకి అధికార ప్రతినిధి అయితే మాత్రం ఇష్టానుసారం మాట్లాడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా ప్రజల మనోభావాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని, జాతికి క్షమాపణలు చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
- ఆ దేశ పార్లమెంట్ రద్దు..
వివిధ పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, దానిని విజయవంతంగా ముందుకు కొనసాగించడంలో ఇజ్రాయెల్ దేశ ప్రభుత్వం విఫలమైంది. పార్లమెంటును రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. అంతే కాకుండా ఈ ఏడాది నవంబర్‌లో ఎన్నికలు జరపనున్నట్లు వెల్లడించింది. తాజా పరిణామాలతో నఫ్తాలీ బెన్నెట్ అతితక్కువ వ్యవధిలోనే ప్రధాని పదవి కోల్పోవాల్సి వచ్చింది.
- ఆయిల్, బంగారంపై కేంద్రం పన్ను బాదుడు.. కానీ...
పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై ట్యాక్స్‌ను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న క్రూడాయిల్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ విధించింది. మరోవైపు, బంగారంపై ప్రాథమిక దిగుమతి పన్నును కేంద్రం.. 7.5 శాతం నుంచి 12.5 శాతానికి పెంచింది.
- మలేసియా ఓపెన్ నుంచి సింధు ఔట్
మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ నుంచి వైదొలిగింది రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు. కౌలాలంపూర్ వేదికగా శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో చైనీస్ తైపీకి చెందిన తై జు యింగ్ చేతిలో సింధు ఓటమిపాలైంది.
- అసత్య ప్రచారాలు చేయకండి.. నటి మీనా భావోద్వేగం
శ్వాసకోశ సమస్యతో నటి మీనా భర్త విద్యాసాగర్ మృతిపై అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో అసత్య ప్రచారాలకు చెక్ పెడుతూ.. నటి మీనానే నేరుగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా భావోద్వేగంతో కూడిన లేఖను పోస్ట్ చేశారు.
TOP NEWS: ప్రధాన వార్తలు @9PM - ఆంధ్రప్రదేశ్ వార్తలు
.
9pm top news