ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 PM - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు

.

9pm top news
ప్రధాన వార్తలు @ 9 PM
author img

By

Published : Aug 19, 2021, 8:59 PM IST

  • దాడులు చేస్తే తప్ప వ్యవహారం తెలియలేదా?: సీఎం

సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నకిలీ చలాన్ల అంశంపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి స్పందించారు. అవినీతి నిరోధక శాఖ దాడులు చేస్తే తప్ప నకిలీ చలానాల వ్యవహారం తెలియలేదా?.. అసలు నకిలీ చలాన్లు ఎలా వచ్చాయని అధికారులను ప్రశ్నించారు. ఇంత పెద్ద స్థాయిలో తప్పులు జరిగినా ఎందుకు తెలియలేదని నిలదీశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భాజపా శ్రేణులను వేధిస్తోంది: కిషన్‌రెడ్డి

విజయవాడలో నిర్వహించిన జన ఆశీర్వాద యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. విభజన వల్ల నష్టపోయిన ఏపీని కేంద్రం ఆదుకుందని స్పష్టం చేశారు. కేంద్ర పథకాలు మినహా రాష్ట్రంలో అభివృద్ధి జరగట్లేదని ఆయన ఆక్షేపించారు. ఆర్టికల్‌ 370 అనేది జిన్నా తీసుకువచ్చిన రాజ్యాంగమని.. అందుకే ఆర్టికల్‌ 370ని కేంద్రం రద్దు చేసిందన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బుచ్చయ్య చౌదరికి చంద్రబాబు ఫోన్‌..

తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, సీనియర్‌ నేత, రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి పార్టీ అధినేత చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడారు. అనుబంధ కమిటీల నియామకం, జిల్లాలో స్థానిక నేతల తీరుపై కొంత కాలంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి అసంతృప్తితో ఉన్నారు. అనుబంధ కమిటీల్లో నియామకానికి సంబంధించి ఇటీవల గోరంట్ల సిఫారసు చేసిన పేర్లకు అధిష్టానం ప్రాధాన్యం ఇవ్వలేదనే చర్చ ఆయన్ను మరింత కలత చెందేలా చేసిందని సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • హత్యగా ప్రాథమిక నిర్ధారణ..

విజయవాడలో కలకలం రేపిన కారులో రాహుల్​ మృతదేహం కేసును పోలీసులు హత్యగా నిర్ధారించారు. వ్యాపార, ఆర్థిక వ్యవహారాలే హత్యకు కారణమని ప్రాథమికంగా అంచనా వేశారు. కారులోని తాడు, దిండు, నీటి సీసాలపై ఉన్న వేలిముద్రలను క్లూస్ టీమ్‌ స్వాధీనం చేసుకుంది. రాహుల్‌ మెడ కమిలిపోయి ఉండటం గమనించిన పోలీసులు.. ఇది హత్యేనని నిర్ధారణకు వచ్చారు. మృతుని బంధువులు కూడా మృతదేహాన్ని పరిశీలించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రాష్ట్రపతికి శస్త్రచికిత్స

భారత రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​కు గురువారం ఉదయం కంటి ఆపరేషన్ (క్యాటరాక్ట్​ సర్జరీ) జరిగింది. ఈ మేరకు శస్త్రచికిత్స విజయవంతమైందని రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటన విడుదలచేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'గాలి'కి సుప్రీం అనుమతి

అక్రమ మైనింగ్​ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్దన్​ రెడ్డి బళ్లారి వెళ్లేందుకు అత్యున్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. కాని కొన్ని షరతులను కూడా విధించింది. ఎన్ని రోజులు, ఎక్కడికి వెళ్తారో ఎస్పీకి చెప్పాలని సుప్రీకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పీఠాధిపతిగా ప్రకటించుకున్న నిత్యానంద!

మధురై పీఠానికి అధిపతిని తానేనని నిత్యానంద స్వామి ప్రకటించుకున్నారు. 292వ పీఠాధిపతి శ్రీ అరుణగిరినాథర్​(77) శివైక్యంతో ఈ అంశంపై నిత్యానంద మళ్లీ తెరపైకి వచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అఫ్గాన్​లో కొత్త రూల్స్ ఇలా...

అఫ్గానిస్థాన్​లో ఓ కౌన్సిల్(Taliban leadership council)​ ద్వారా పరిపాలన సాగనుందని, ప్రజాస్వామ్యానికి చోటు లేదని స్పష్టం చేశారు తాలిబన్లు(Taliban). తాలిబన్​ సుప్రీం లీడర్​ హోదాలో హైబతుల్లా అఖుండ్​జాదా వ్యవహరిస్తారని తెలిపారు. అఫ్గాన్​ పైలట్లు, సైనికులు విధుల్లో చేరాలని సూచించినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రాహుల్​ ద్రవిడ్‌ ఒక్కడే

ఎన్​సీఏ హెడ్​ పదవి కోసం భారత మాజీ క్రికెటర్లు ఎవరూ ఆసక్తి కనబరుచలేదు. రెండేళ్లుగా ఆ పదవిలో ఉన్న ద్రవిడ్​ పదవీకాలం ఇటీవల ముగియగా.. మరోసారి ఆ హోదాకు అతనొక్కడే దరఖాస్తు చేసుకున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'బెల్​బాటమ్​' ఎలా ఉందంటే?

బాలీవుడ్​ స్టార్​ హీరో అక్షయ్​కుమార్​ నటించిన 'బెల్​ బాటమ్' గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో అక్షయ్​ అండర్​ కవర్​ ఏజెంట్​గా కనిపించారు. ఈ సినిమా ఎలా ఉందంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.