- 'అంబేడ్కర్ కోనసీమ' జిల్లాకు మంత్రివర్గం ఆమోదం
సచివాలయంలో ఉదయం సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రజల నుంచి విజ్ఞప్తులు, సూచనలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం... కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పేరును ఖరారు చేసింది.
- 'వైకాపా కార్యకర్తల్లా పోలీసుల తీరు'
చిత్తూరు మాజీ మేయర్ కఠారి హేమలత మీదకు పోలీసు జీపు ఎక్కించడాన్ని తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. ఇది ప్రభుత్వం చేయించిన దౌర్జన్యకాండని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా కార్యకర్తల్లా మారి తప్పులు చేస్తున్న పోలీసులను వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
- ప్రభుత్వానికి సమ్మె నోటీసులు
ప్రభుత్వానికి.. మున్సిపల్ కార్మిక ఉద్యోగ సంఘాల జేఏసీ సమ్మె నోటీసు ఇచ్చింది. హెల్త్ అలవెన్సు బకాయిలతో పాటు వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. సమ్మె నోటీసు ఇచ్చారు.
- హిందూపురం వైకాపాలో భగ్గుమన్న వర్గపోరు.. ప్రెస్ క్లబ్‌పై రాళ్ల దాడి
సత్యసాయి జిల్లా హిందూపురంలో వైకాపాలో వర్గపోరు భగ్గుమంది. వైకాపా నేత కొండూరు వేణుగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ అనుచరుల మధ్య ఘర్షణ.. ఉద్రిక్తతకు దారి తీసింది.
- ద్రౌపది నామినేషన్.. సోనియా, మమతతో సంప్రదింపులు
రాష్ట్రపతి ఎన్నికలకు ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపదీ ముర్ము నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయనున్న యశ్వంత్ సిన్హాకు కేంద్రం జడ్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించింది.
- దేశంలో భారీగా పెరిగిన కేసులు..
భారత్‌లో కరోనా కేసులు మళ్లీ భారీగా పెరిగాయి. ఒక్కరోజే 17,336 మందికి వైరస్ సోకింది. మరో 13 మంది చనిపోయారు. 13,029 మంది కోలుకున్నారు.
- కొలంబియా యూనివర్సిటీని సందర్శించిన సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ
అమెరికా పర్యటనలో ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ శుక్రవారం న్యూయార్క్ నగరంలోని కొలంబియా యూనివర్సిటీని సందర్శించారు. విశ్వవిద్యాలయంలోని లైబ్రరీలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి.. నివాళులు అర్పించారు.
- రూ.4.3లక్షల కోట్లకు భారత మీడియా, వినోద రంగం!
భారత మీడియా, వినోద రంగం వాటా 2026 నాటికి రూ.4.30 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఓ అధ్యయనం తేల్చింది. సంప్రదాయ మీడియాలో వృద్ధితోపాటే డిజిటల్ మీడియా, ఇంటర్నెట్, మొబైల్ ప్రకటనలు మరింత విస్తృతమవడం వల్ల ఇది సాధ్యమవుతుందని తెలిపింది.
- ఒకే ఒక్కడు 'మిచెల్'.. ఇంగ్లాండ్‌పై 400 పరుగులు చేసి రికార్డు!
ఇంగ్లాండ్‌పై 3 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 400కుపైగా పరుగులు చేసిన తొలి న్యూజిలాండ్ బ్యాటర్‌గా నిలిచాడు డారిల్ మిచెల్. 3 సెంచరీలతో ఇప్పటికే మరో ఇన్నింగ్స్ మిగిలుండగానే 482 పరుగులతో ఉన్నాడు.
- నటుడు నందమూరి బాలకృష్ణకు కరోనా
సినీ నటుడు, హిందూపూర్ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణకు కరోనా సోకింది. స్వయంగా ఆయనే ఈ విషయం వెల్లడించారు. రెండ్రోజులుగా తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
TOP NEWS: ప్రధాన వార్తలు @ 9PM
ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు
9PM TOP NEWS