ETV Bharat / city

ప్రధానవార్తలు@9am - ఆంధ్రప్రదేశ్​ లేటెస్ట్​ న్యూస్​

.

9am topnews
ప్రధానవార్తలు@9am
author img

By

Published : Sep 1, 2022, 8:59 AM IST

  • 'ఫేస్‌ యాప్‌' సందిగ్ధం... మంత్రి బొత్సతో నేడు మరోసారి చర్చలు

యాప్‌ ద్వారా ఉపాధ్యాయుల హాజరు నమోదుపై సందిగ్ధం కొనసాగుతోంది. ఇవాళ్టి నుంచి ఫేస్‌యాప్‌ హాజరు నమోదు తప్పనిసరని ప్రభుత్వం ఉత్తర్వులివ్వగా.. ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్‌లోడ్‌ చేసుకునేది లేదని ఉపాధ్యాయ సంఘాలు తేల్చి చెప్తున్నాయి. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే రేపటి నుంచి యాప్‌ డౌన్‌ చేస్తామని హెచ్చరించాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • విషాదాన్ని నింపిన వినాయక నిమజ్జనం

వినాయక చవితి ఆ ఇంట విషాదాన్ని నింపింది. విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా ప్రమాదవ శాత్తు ఇద్దరు నీటిలో కొట్టుకుపోయారు. వారిలో ఒకరు మృతి చెందగా మరొకరు గల్లంతయ్యారు. గల్లంతైన అమ్మాయి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మరో రెండేళ్లలో ప్రైవేటుకు దీటుగా.. ప్రభుత్వ ఆస్పత్రులు: కృష్ణబాబు

వైద్య, ఆరోగ్యశాఖను బలోపేతం చేసేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. ఆరోగ్యశాఖలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తున్నామన్న ఆయన.. పేదలకు మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వివిధ రూపాల్లో విఘ్నేశ్వరుడు.. ఆకట్టుకుంటున్న లంబోదరుడు

వినాయక చవితి వచ్చిందంటే ఆ సందడే వేరు. వాడవాడలా బొజ్జగణపయ్యను మండపాల్లో కొలువుదీర్చి.. వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. కొంతమంది కాస్త భిన్నంగా ఆలోచించి.. గణనాథుడి ప్రతిమలను రూపొందించారు. పైనాపిల్, నాణేలు, నెమలి పింఛాలు, కొబ్బరి చిప్పలు, ప్రకృతి గణపతి.. ఇలా వివిధ రూపాల్లో లంబోదరుడు ఆకట్టుకుంటున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఐదో పెళ్లికి సిద్ధమైన 'అతడు'.. రెండో భార్య, ఏడుగురు పిల్లల ఎంట్రీతో..

నాలుగు పెళ్లిళ్లు, ఏడుగురు పిల్లలు. ఇది చాలదని ఓ వ్యక్తి ఐదో పెళ్లికి సిద్ధమయ్యాడు. రాత్రికి రాత్రే రహస్యంగా మరో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలిసి అతడి రెండో భార్యతో పాటు ఏడుగురు పిల్లలు, బంధువులు అక్కడికి వెళ్లి ఆ వివాహాన్ని అడ్డుకున్నారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే.. ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దేశంలో ఎక్కడున్నా ఆ బడిలో చేరొచ్చు.. తొలి వర్చువల్​ స్కూల్ ప్రారంభం

దేశంలోనే తొలి వర్చువల్ పాఠశాలను ప్రారంభించింది దిల్లీ ప్రభుత్వం. ఏ రాష్ట్రంలో ఉన్నా.. ఈ బడిలో చేరి ఆన్​లైన్​ ద్వారా విద్యను అభ్యసించవచ్చని తెలిపింది. ఇంతకీ ఈ వర్చువల్ స్కూల్ ఎలా పనిచేస్తుంది? పరీక్షలు ఎలా నిర్వహిస్తారు? ఆ స్కూల్ సర్టిఫికేట్స్​ ఎక్కడైనా చెల్లుతాయా అనే విషయం తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్​ చేయండి

  • 50 వేల జవాన్లతో రష్యా సైనిక విన్యాసాలు.. భారత్​, చైనా సహా!

రష్యా మరోసారి భారీ ఎత్తున సైనిక విన్యాసాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి వారం రోజులపాటు జరగనున్న ఈ యుద్ధ విన్యాసాల్లో భారత్‌, చైనా సహా మాజీ సోవియట్‌ దేశాలు పాల్గొంటాయని మాస్కో ప్రకటించింది. రష్యాతో కలిసి ఇతర దేశాలు ఈ విన్యాసాల్లో పాల్గొనటంపై అమెరికా ఆందోళన వ్యక్తంచేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • తగ్గిన 'కాఫీ డే' అప్పులు.. పూర్వ వైభవం తిరిగి వచ్చేనా!

కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌ అప్పులు తగ్గాయి. ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ.1810 కోట్లకు చేరినట్లు కంపెనీ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. కాఫీ డే వ్యవస్థాపకుడైనా వీజీ సిద్ధార్థ్‌ ఆత్మహత్య చేసుకున్న తర్వాత కంపెనీ పగ్గాలు అందుకున్న ఆయన భార్య మాళవికా హెగ్డే.. కంపెనీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సూర్యకుమార్‌ మెరుపులు.. హాంకాంగ్​పై టీమ్​ఇండియా విజయం

ఆసియా కప్‌లో భాగంగా ఇప్పటికే పాకిస్థాన్‌పై గెలిచి జోరుమీదున్న భారత్‌.. పసికూన హాంకాంగ్‌పై 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో భారత్‌ సూపర్-4కు దూసుకెళ్లింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోర్‌ నమోదు చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌(68 నాటౌట్‌) విశ్వరూపం ప్రదర్శించగా, కోహ్లీ(59 నాటౌట్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆమిర్ షాకింగ్​ నిర్ణయం.. ఏకంగా రూ.100కోట్లను..

'లాల్‌ సింగ్‌ చడ్డా' విషయంలో ఇప్పటికే భారీ నష్టాలను చవి చూసిన బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ ఖాన్‌ ఇప్పుడు మరో నష్టాన్ని తన భుజాలపై వేసుకున్నారు. ఈ సినిమా నష్టాన్ని తగ్గించడానికి తన పారితోషికాన్నీ వదులుకోనున్నారు. 'లాల్‌ సింగ్ చడ్డా' మొత్తం బడ్జెట్‌ రూ.180 కోట్లు కాగా ఆమిర్‌, అతడి మాజీ భార్య కిరణ్‌రావ్‌ ఈ సినిమాకు సహ నిర్మాతలుగా వ్యవహరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.