ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9AM

.

ప్రధాన వార్తలు @ 9AM
ప్రధాన వార్తలు @ 9AM
author img

By

Published : Feb 9, 2022, 9:00 AM IST

  • రూ.2,000 కోట్ల రుణం తీసుకున్నా... చేతికి చిక్కలేదు.. ఎందుకంటే..

కొత్త అప్పులు పొందేందుకు రాష్ట్రం అనేక కష్టాలు పడుతోంది. మంగళవారం సెక్యూరిటీల వేలంలో ప్రభుత్వం పాల్గొని రూ.2వేల కోట్ల రుణం తీసుకున్నా.. అది చేతికి చిక్కలేదు. రుణ మొత్తం ఓడీ కింద ఆర్‌బీఐకే జమ చేయాల్సి చేయాల్సి వచ్చినట్లు తెలిసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • కొలువుల ప్రకటనకు ఇంకెన్నాళ్లో !.. నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగుల నిరీక్షణ

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ప్రత్యేకించి గ్రూప్‌-1, 2, పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రకటనల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం నోటిఫికేషన్లు వచ్చే సూచనలు ఫలితం కనిపించకపోవడంతో లక్షల మంది నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'జూన్ 30లోగా కోర్టు భవనాన్ని అప్పగిస్తాం'.. నివేదించిన ప్రభుత్వం

విజయవాడలోని బహుళ అంతస్తుల కోర్టు భవన సముదాయాన్ని ఈ ఏడాది జూన్ 30లోగా పూర్తిచేసి అప్పగిస్తామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. భవన నిర్మాణ గుత్తేదారుకు చెల్లించాల్సిన రూ .5 కోట్ల బకాయిల సొమ్మును ఈనెల 15లోగా జమచేస్తామని ప్రభుత్వ న్యాయవాది(టీపీ) నర్సిరెడ్డి తెలిపారు. అనంతరం విచారణ ఈనెల 21కి వాయిదా పడింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • rape:వివాహితపై అత్యాచారం.. వీడియో తీసిన నిందితుడి భార్య

విజయవాడలో దారుణం జరిగింది. కళ్ల ముందే భర్త ఓ మహిళపై అత్యాచారం చేస్తుంటే అడ్డుకోవాల్సింది పోయి, అతడికి సహకరించి, ఆ దృశ్యాలను ఫోన్లో బంధించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • JNU VC News: జేఎన్‌యూ వీసీ ప్రకటనపై వరుణ్‌ గాంధీ విమర్శలు

దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) తొలి మహిళా వీసీగా డా.శాంతిశ్రీ ధూళిపూడి విడుదల చేసిన ప్రకటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అందులో వ్యాకరణ దోషాలు దొర్లడమే ఇందుకు కారణం. దీంతో భాషా నైపుణ్యాల విషయంలో ఆమెపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • చెలరేగిన నక్సల్స్​.. పోలీసులపై బాంబు దాడి, వాహనాలకు నిప్పు!

రహదారి నిర్మాణంలో ఉన్న ఓ ట్రాక్టర్, జేసీబీకి నిప్పంటించారు మావోయిస్టులు. ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. మరోవైపు.. ఛత్తీస్​గఢ్​లో నక్సల్స్ అమర్చిన బాంబు పేలి ఇద్దరు పోలీసు అధికారులతో సహా నలుగురు సీఆర్​పీఎఫ్ సిబ్బంది తీవ్ర గాయాలపాలయ్యారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • కొండ చీలికలో చిక్కిన యువకుడు.. రెండు రోజులుగా అన్నపానీయాలు లేక..

కేరళలోని పాలక్కాడ్‌ సమీప మలప్పుజ ప్రాంతంలో కొండ చరియల్లో చిక్కుకుపోయిన యువకుడ్ని రక్షించేందుకు సహాయక బృందాలు రెండు రోజులుగా ప్రయత్నిస్తున్నాయి. తీరప్రాంత రక్షకదళం హెలికాప్టర్‌ కూడా యువకుణ్ని కాపాడే చర్యల్లో నిమగ్నమై ఉంది. ఇతణ్ని కాపాడేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సైన్యం సాయం కోరగా.. బెంగళూరు నుంచి ఓ ప్రత్యేకదళం పంపుతున్నట్లు సదరన్‌ కమాండ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ అరుణ్‌ సీఎంఓకు సమాచారం ఇచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • హ్యుందాయ్‌ 'కశ్మీర్‌' ట్వీట్‌ వివాదం.. దక్షిణ కొరియా ప్రభుత్వం ఏమందంటే..?

'కశ్మీర్‌' వ్యవహారంపై హ్యుందాయ్‌కు చెందిన ఓ పాకిస్థాన్‌ డీలర్‌ సోషల్‌మీడియాలో చేసిన ఓ పోస్ట్‌తో ఆ సంస్థ పెను వివాదంలో చిక్కుకుంది. దీనిపై హ్యుందాయ్‌తో పాటు ఆ కంపెనీ సొంత దేశమైన దక్షిణ కొరియా ప్రభుత్వం కూడా స్పందిస్తూ విచారం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • Kohli Rohit: 'కోహ్లీ-రోహిత్ మధ్య గొడవలా?'

టీమ్​ఇండియా కెప్టెన్- మాజీ కెప్టెన్​కు పడట్లేదు అంటూ వస్తున్న వార్తలను సునీల్ గావస్కర్ మరోసారి కొట్టిపారేశాడు. వాళ్లు బాగానే ఉంటారని చెప్పుకొచ్చాడు. సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని సన్నీ అన్నాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • పాట కోసం ఆరు కిలోలు తగ్గిన డింపుల్.. ముద్దుపై మీనాక్షి క్లారిటీ

ఫిబ్రవరి 11న 'ఖిలాడి'.. థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో సినిమా విశేషాలను పంచుకున్నారు హీరోయిన్లు మీనాక్షి చౌదరి, డింపుల్​ హయాతి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.