- AP Omicron cases: రాష్ట్రంలో మరో ఒమిక్రాన్ కేసు నమోదు..17కు చేరిన మొత్తం కేసులు
Omicron cases in andhra pradesh: రాష్ట్రంలో మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. విదేశాల నుంచి ప్రకాశం జిల్లాకు వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ నిర్దారణ అయినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Perni nani on website servers down: ఆందోళన వద్దు.. వాహనదారులకు మరో అవకాశం: మంత్రి పేర్ని నాని
గురువారం రాష్ట్ర వ్యాప్తంగా షోరూంలలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంపై రవాణాశాఖ మంత్రి పేర్ని నాని స్పందించారు. రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడం వల్ల ప్రజలు, వాహనదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Wineshops timing change: ఇవాళ రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలు.. 12 గంటల వరకు బార్లు
రాష్ట్రంలోని మందుబాబులకు పండగే పండుగ. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం దుకాణాల సమయాల్లో మార్పులు చేస్తూ ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ACB Annual Crime Report: ఎసీబీ వార్షిక నివేదిక- 2021... అవినీతిలో రెవెన్యూదే అగ్రస్థానం
అవినీతిలో రెవెన్యూ శాఖ(ACB) ఏటికేడు తగ్గేదేలే అంటోంది. ఈ ఏడాదీ రెవెన్యూ శాఖదే అవినీతిలో అగ్రస్థానమని అవినీతి నిరోధక శాఖ తేల్చింది. వార్షిక నివేదిక విడుదల చేసిన అనిశా...ఇంధన, పంచాయతీరాజ్, పురపాలక శాఖల్లోనూ కోట్లకొద్దీ పోగేసిన లంచగొండులు ఎక్కువ మందే ఉన్నారని నివేదించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కశ్మీర్లో ఎన్కౌంటర్- ముగ్గురు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్ శ్రీనగర్లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ముష్కరులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. నలుగురు భద్రతా సిబ్బంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- విశ్వగమనంపై మహమ్మారి ప్రభావం..!
2022లో ఒకవేళ కొవిడ్ పీడ విరగడ అయినా.. ప్రజలకు పాత రోజులు పునరావృతమయ్యే అవకాశం కనిపించడం లేదు. కొవిడ్ దెబ్బకు అన్ని రంగాలూ సమూల మార్పులకు లోనవ్వడమే దీనికి కారణం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కళాశాల వద్ద పేలుడు.. నలుగురు మృతి, 15 మందికి గాయాలు
పాకిస్థాన్లో మరోసారి బాంబు పేలుడు స్థానికంగా కలకలం రేపింది. క్వెట్టాలోని జిన్నాహ్ రోడ్డు సమీపంలో జరిగిన ఈ పేలుడులో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. 15 మంది గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కొత్త సంవత్సరంలో.. 'బంగారం' దారెటు?
కొత్త ఏడాదిలో బంగారం ధర మరింత భగ్గుమంటుందా.. కాస్త దిగి వచ్చి, కొనుక్కునేందుకు అనువుగా మారుతుందా అనే ఆలోచనలు పలువురిలో ఉన్నాయి. కొవిడ్, ఒమిక్రాన్ పరిణామాలతో పాటు అమెరికా వడ్డీరేట్లు, బాండ్ రాబడులు, డాలర్ మారకపు విలువ వంటివి పుత్తడి ధరలపై ప్రభావం చూపనున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆసియా కప్ ఫైనల్లో యువ భారత్.. సెమీస్లో బంగ్లా చిత్తు
అండర్-19 ఆసియా కప్లో యువ భారత జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది. ఆంధ్ర కుర్రాడు షేక్ రషీద్ సత్తాచాటడం వల్ల సెమీస్లో బంగ్లాను చిత్తుచేసి తుదిపోరుకు అర్హత సాధించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Tollywood Movies 2021: 'అఖండ' విజయాలు.. 'పుష్ప'గుచ్ఛాలు
కరోనా సంక్షోభం నేపథ్యంలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొంది చిత్రసీమ. అయితే.. తెలుగు చిత్ర పరిశ్రమ ఆచితూచి అడుగులేసింది. దేశ సినీపరిశ్రమకే ఊపుతెచ్చేలా వ్యవహరించింది. ఈ నేపథ్యంలో 2021లో థియేటర్లలో, ఓటీటీ వేదికగా అభిమానులను అలరించిన సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.