ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 9AM - 9AM TOP NEWS

ప్రధాన వార్తలు @ 9AM

9AM TOP NEWS
ప్రధాన వార్తలు @ 9AM
author img

By

Published : Oct 22, 2021, 9:00 AM IST

  • కొనసాగుతున్న చంద్రబాబు 36 గంటల నిరసన దీక్ష..

తెదేపా కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు 36 గంటల దీక్ష రెండోరోజూ కొనసాగుతోంది. చంద్రబాబు దీక్షకు మద్దతుగా ఎన్టీఆర్ భవన్‌కు కార్యకర్తలు పెద్దఎత్తున తరలివస్తున్నారు. ఇవాళ రాత్రి 8 గంటల వరకు కొనసాగనున్న చంద్రబాబు దీక్ష కొనసాగనుంది. కాసేపట్లో తెదేపా అధినేతకు వైద్యులు పరీక్షలు నిర్వహించనున్నారు.

  • TTD TICKETS: నేటి నుంచి శ్రీవారి దర్శన టికెట్లు విడుదల

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను తితిదే నేడు విడుదల చేయనుంది. రూ.300ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

  • ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు 25 నుంచి కౌన్సెలింగ్‌

ఈనెల 25 నుంచి రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు వెబ్‌ కౌన్సెలింగ్‌(ap Engineering Counselling-2021) ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆన్‌లైన్‌ ప్రవేశాల షెడ్యూల్‌ను విజయవాడలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్​ విడుదల చేశారు. రాష్ట్రంలో మొదటిసారిగా ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లోని 35% సీట్లను వెబ్‌ కౌన్సెలింగ్‌ పరిధిలోకి తీసుకొచ్చినట్లు మంత్రి చెప్పారు.

  • Azadi Ka Amrit Mahotsav: బానిసత్వానికి తెరలేచిన రోజు..

అక్టోబర్​ 22.. భారతదేశానికి బానిసత్వాన్ని పరిచయం చేసిన రోజు! సుసంపన్నమైన సువిశాల భారతావనిని (Azadi Ka Amrit Mahotsav) ఆక్రమించుకోవడం ఆరంభించిన రోజు. దేశ సంపదను దోచుకోవడానికి రాచబాట పడిన రోజు. సొంత దేశంలోనే బానిసత్వానికి బాటలు పడిన రోజు.

  • 'చైనాతో చర్చలు.. ప్రతిసారి ఫలితాలు రావు'

ఈ నెల 11న జరిగిన భారత్​- చైనా సరిహద్దు చర్చల(india china border news) నేపథ్యంలో ఆర్మీ చీఫ్​ జనరల్​ ఎమ్​ఎమ్​ నరవణె కీలక వ్యాఖ్యలు చేశారు(india china news). చైనాతో జరిగే చర్చల్లో ప్రతిసారీ ఫలితాలు రావాలి అని ఆశించకూడదన్నారు.

  • చైనా 'బొమ్మ'ల్లో ప్రమాదకర రసాయనాలు..

కొన్ని మేడ్​-ఇన్​-చైనా బొమ్మలపై(made in china toys) ప్రమాదకర రసాయనాలు కోటింగ్​ చేసినట్టు అమెరికా అధికారులు గుర్తించారు(us china news). అనంతరం వాటిని జప్తు చేశారు. కాగా.. ఈ తరహా బొమ్మలు భారత్​లోనూ ఎక్కువగా లభిస్తుండటం, పిల్లల కోసం తల్లిదండ్రులు వాటిని అధికంగా కొనుగోలు చేస్తుండటం గమనార్హం(india china news).

  • పండగ సమయంలో కొలువుల జాతర

ఇ-కామర్స్‌ రంగంలో భారీ ఎత్తున తాత్కాలిక నియామకాలు జరుగుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా వినియోగదారు సెంటిమెంటు, గిరాకీ పెరగడం ఇందుకు కారణం. ఈ నేపథ్యంలోనే అక్టోబరు-డిసెంబరులో తాత్కాలిక సిబ్బంది నియామకాల్లో 400 శాతం వృద్ధి కనిపిస్తోందని క్వెస్‌ కార్ప్‌ అనుబంధ సంస్థ టాస్క్‌మో తెలిపింది.

  • Fuel prices today: ఆగని పెట్రో బాదుడు.. మళ్లీ పెరిగిన ధరలు

దేశంలో ఇంధన ధరలు (Fuel Price Today) మరోసారి పెరిగాయి. లీటర్​ పెట్రోల్​, డీజిల్​పై 35 పైసలు చొప్పున పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.

  • అవినీతి కూపంగా హెచ్​సీఏ.. సుప్రీం వ్యాఖ్యలతో కొత్త ఆశలు

హైదరాబాద్‌ అంటే ఇప్పటి తరానికి గుర్తొచ్చేది బిర్యానీ. కాని ఒకప్పుడు హైదరాబాద్‌ అంటే క్రికెట్‌.. క్రికెట్‌ అంటే హైదరాబాద్‌. బ్యాటింగ్‌ మణికట్టు మాయాజాలానికి పెట్టింది పేరు. ప్రస్తుత పాలకుల మధ్య విభేదాలు (hyderabad cricket association news) పతాక స్థాయికి చేరుకోవడంతో హైదరాబాద్‌ క్రికెట్‌ ప్రభ పూర్తిగా మసకబారింది.

  • వేడుకగా హాస్య నటుడు వైవా హర్ష వివాహం

షార్ట్​ ఫిల్మ్స్​తో పాటు సినిమాల్లోనూ మెప్పిస్తున్న వైవా హర్ష వివాహం ఘనంగా జరిగింది. పలువురు సినీ ప్రముఖులు హాజరై దంపతుల్ని దీవించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.