ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 AM - ap top ten news

ప్రధాన వార్తలు @ 9 AM

9am top news
ప్రధాన వార్తలు @ 9 AM
author img

By

Published : Jun 3, 2021, 8:58 AM IST

  • ఇళ్ల నిర్మాణానికి నేడు శ్రీకారం

2023 నాటికి 'నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు' హామీ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణం నేడు ప్రారంభం కానుంది. సీఎం జగన్ తాడేపల్లి నుంచి వర్చువల్‌గా పనులు ప్రారంభించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆనందయ్య మందు హైకోర్టులో నేడు విచారణ

ఆనందయ్య మందు పంపిణీపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. మందు పంపిణీ చేయాలని కోరుతూ నాలుగు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మరో జాయింట్ కలెక్టర్ పోస్టు!

రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో మరో జాయింట్‌ కలెక్టర్ పోస్టును మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 'జాయింట్‌ కలెక్టర్‌ హౌసింగ్‌' పేరుతో కొత్త పోస్టు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మరికొన్ని టీకా డోసులు

రాష్ట్రానికి మరికొన్ని కరోనా టీకా డోసులు చేరాయి. దిల్లీ నుంచి కొవిషీల్డ్, హైదరాబాద్ నుంచి కొవాగ్జిన్ టీకాలు విజయవాడకు చేరుకున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భారీగా దొంగ నోట్లు స్వాధీనం

కర్ణాటకలో భారీగా దొంగ నోట్లను పట్టుకున్నారు పోలీసులు. నిందితుల నుంచి రూ.72లక్షల నకిలీ నోట్లు సహా రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 33శాతం సీట్లు కేటాయింపు

మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలల్లో విద్యార్థినులకు 33 శాతం సీట్లు కేటాయించనున్నట్లు బిహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రకటించారు. ఈ మేరకు అధికారులతో చర్చించారు నితీశ్ కుమార్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • యువతిపై అత్యాచారం

మహారాష్ట్రలో ఓ యువతిని అత్యాచారం చేసిన ఘటనలో నలుగుర్ని అరెస్ట్​ చేశారు పోలీసులు. మరో ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నిరుద్యోగంలోకి 20.5 కోట్ల మంది..

2022లో 20.5 కోట్ల మంది నిరుద్యోగులయ్యే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి (ఐరాస) అంచనా వేసింది. 2019తో పోలిస్తే ప్రస్తుతం అదనంగా 10.8 కోట్ల మంది కార్మికులను పేదలు లేదా నిరుపేదలుగా మహమ్మారి మార్చిందని పేర్కొంది. పేదరిక నిర్మూలన దిశగా ఐదేళ్లుగా సాధించిన వృద్ధిని నష్టపోయినట్లయిందని తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • క్యాండిడేట్స్‌ టోర్నీకి అర్హత

ప్రపంచ మహిళల ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ కోనేరు హంపి (Koneru Humpy) క్యాండిడేట్స్ చెస్ టోర్నీ(Candidates Tournament)కి అర్హత సాధించింది. ఎనిమిది మంది క్రీడాకారిణుల మధ్య జరిగే క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో విజేత.. ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ కోసం డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జు వెంజున్‌ (చైనా)తో తలపడుతుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • షూటింగ్​లు తిరిగి ప్రారంభం

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ తగ్గుతున్న నేపథ్యంలో త్వరలో షూటింగ్​లు తిరిగి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. భారీబడ్జెట్​ చిత్రాలైన 'ఆర్ఆర్ఆర్', 'ఆచార్య' చిత్రీకరణలను తొలుత మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.