- మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి
వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారన్న తెదేపానేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆరోపణల్ని.. ఆయన స్వీకరించారు. తాను రియల్ ఎస్టేట్‌తో పాటు కాంట్రాక్టులు కూడా చేస్తున్నానని.., అందులో తప్పేముందని ప్రశ్నించారు.
- రోడ్డు ప్రమాదంలో 12 మంది కూలీలకు తీవ్ర గాయాలు
నెల్లూరు జిల్లా బోగోలు మండలంలోని జాతీయ రహాదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మంది కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. వాళ్లలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పనులు ముగించుకొని ఆటోలో వెళ్తుండగా.. కారు వేగంగా వచ్చి వెనుక నుంచి ఢీకొట్టింది.
- రాష్ట్ర సలహాదారు పదవికి బొంతు రాజీనామా
ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన పదవితో ప్రజలకు, పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నానని పీఆర్,ఆర్డీ అండ్ ఆర్డబ్ల్యూఎస్ రాష్ట్ర సలహాదారు బొంతు రాజేశ్వరరావు అన్నారు. అందుకే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
- అక్కడ విధుల్లో చేరాలంటే ఆయన్ని కలవాలంటా..!
రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలు కొనసాగుతున్న నేపథ్యంలో.. అధికార పార్టీ వైకాపా నాయకుల హవా కొనసాగుతోంది. శ్రీ సత్యసాయి జిల్లా లోని ఎంపీడీవో కార్యాలయానికి బదిలీపై వచ్చిన ఓ ఉద్యోగినికి ఎంపీడీవో షాకిచ్చారు. విధుల్లో చేరాలంటే.. ముందుగా ఎమ్మెల్యే సోదరుడిని కలిసిరావాలంటూ ఆదేశాలు జారీ చేయడం శోచనీయంగా మారింది.
- 'ఇక్కడ సర్కారు కూలిస్తే.. అక్కడ వారిని గద్దె దింపుతాం'
'మహారాష్ట్ర మాదిరిగా తెలంగాణలోనూ ప్రభుత్వాన్ని కూలదోస్తామని ఓ కేంద్రమంత్రి అంటున్నారు. వారు ఇక్కడ సర్కారు కూలిస్తే.. తాము దిల్లీలో వారిని గద్దె దింపుతాం' అని తెలంగాణ సీఎం కేసీఆర్ హెచ్చరించారు. తెలంగాణ కోసం ప్రజలు 60 ఏళ్లు పోరాటం చేశారని.. మరో పోరాటానికి వెనకాడరని కేసీఆర్ స్పష్టం చేశారు. నవ భారత నిర్మాణం కోసం మరోసారి ఉద్యమిస్తామన్నారు.
- ప్రియుడి మోజులో భర్తకు విడాకులు.. పిల్లల్నీ వదిలేసి పారిపోయిన మహిళ!
ప్రియుడి మోజులో అప్పటికే భర్తను వదిలేసిన ఆ మహిళ.. తన ఇద్దరు చిన్నారులను కూడా భారంగా భావించింది. ఒకరోజు ఆస్పత్రికి వెళ్తున్నా అని చెప్పి.. వారిని కూడా విడిచి పెట్టి తన ప్రేమికుడితో పారిపోయింది. ఈ అమానవీయ ఘటన మధ్యప్రదేశ్ ఉజ్జయిన్లో జరిగింది.
- అపార్ట్మెంట్లో పైథాన్ కలకలం..
ఉత్తరాఖండ్ హరిద్వార్‌లోని ఓ అపార్ట్మెంట్లో పైథాన్ కలకలం సృష్టించింది. అపార్ట్మెంట్ రెండో అంతస్తులోని ఓ ఇంటి బాల్కనీలో చొరబడింది. ఇది గమనించిన యజమాని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు కొద్దిసేపు శ్రమించి పామును పట్టుకున్నారు. రెండో అంతస్తులోకి ఇంత భారీ కొండచిలువ చొరబడటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు స్థానికులు.
- వింత చోరీ.. ఇంట్లోకి అవసరమైన వాటినే ఎత్తుకెళ్లిన దొంగలు
ఎక్కడైనా దొంగలు కనిపించిన ప్రతి వస్తువును దోచుకెళ్తారు.. ఏదైనా షాపులోకి చొరబడితే విలువైన వస్తువులన్నీ ఎత్తుకెళ్తారు.. కానీ ఇక్కడ మాత్రం ఇంట్లోకి అవసరమైన సామాను మాత్రమే తీసుకెళ్లారు.. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..
- బాలయ్య డైలాగ్స్‌తో అదరగొట్టిన తమిళ డైరెక్టర్
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన 'ది వారియర్'. తమిళ డైరెక్టర్ లింగుసామి ఈ సినిమాకు దర్శకుడు. లింగుసామి డైరెక్ట్‌గా తెలుగులో చేస్తున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం. ఈ సినిమా జులై 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుండగా.. అనంతరపురంలో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
- విజయ్ బోల్డ్ పోస్టర్‌పై సమంత.. రష్మిక ఎమోషనల్ పోస్ట్
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా 'లైగర్'. ఈ మూవీ ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో.. చిత్రబృందం ప్రచారాన్ని మొదలు పెట్టింది. ఈ క్రమంలో 'లైగర్' నుంచి విజయ్ 'న్యూడ్' పోస్టర్‌ను సోషల్ మీడియాలో వదిలింది. దీంతో ఆ పోస్టర్ క్షణాల్లోనే వైరల్‌గా మారింది.
TOP NEWS: ప్రధాన వార్తలు @7PM - Telugu latest news
.
7pm Top news