- కూల్చేసిన గోడ కట్టుకునేందుకు.. అయ్యన్నకు హైకోర్టు అనుమతి
మున్సిపల్ అధికారులు కూల్చివేసిన ఇంటి ప్రహరీ గోడను కట్టుకునేందుకు తెలుగుదేశం సీనియర్ నేత అయ్యన్నపాత్రుడుకు హైకోర్టు అనుమతిచ్చింది. నోటీసులు ఇవ్వకుండా.. అక్రమంగా ఇంటి గోడను నర్సీపట్నం మున్సిపల్ అధికారులు కూల్చివేశారని అయ్యన్న కోర్టును ఆశ్రయించారు.
- వైకాపాకు షాక్.. వెయ్యి మంది రాజీనామా!
కోనసీమ జిల్లాకు చెందిన వైకాపా రాష్ట్ర కార్యదర్శి రుద్రరాజు వెంకటరామరాజుతోపాటు పలువురు నేతలు వైకాపాకు రాజీనామా చేశారు. పార్టీ కోసం పని చేసిన వారిని పక్కన పెట్టి.. జనసేన నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేస్తున్నారని వెంకటరామరాజు ఆరోపించారు. అందుకే తనతోపాటు వెయ్యి మంది కార్యకర్తలు వైకాపాకు రాజీనామా చేస్తునట్లు తెలిపారు.
- 'అలాంటప్పుడు మాకు ఈ పదవి ఎందుకు..?' ఎమ్మెల్యే ఎదుట వైకాపా సర్పంచ్ నిరసన
అధికార పార్టీ అసమర్ధ పాలనను సొంత పార్టీ ప్రజాప్రతినిధులే వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను బాహాటంగా ఎండగడుతూ తమ అసమ్మతిని తెలియజేస్తున్నారు. ప్రజల ఆశీర్వాదంతో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనా.. వారికి సేవ చేయలేకపోతున్నామంటూ వాపోతున్నారు.
- "రాష్ట్రాన్ని మద్యం మత్తులో ముంచాలనేదే.. సీఎం జగన్ ఆలోచన"
సీఎం జగన్పై మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. మద్యనిషేధం అని చెప్పి.. ఇప్పుడు వీధివీధిన మద్యం దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
- జమ్ముకశ్మీర్లో వరదలు.. 11 మంది పర్యటకులు గల్లంతు!
జమ్ముకశ్మీర్లో వరదలు సంభవించాయి. పహల్గామ్లో 11మంది పర్యటకులు, ఇద్దరు టూరిస్ట్ గైడ్లు వరదల్లో చిక్కుకున్నారు. భారీ వర్షాల ధాటికి పలు జాతీయ రహదారులు కొట్టుకుపోయాయి. మరికొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.
- 'విచారణకు హాజరుకాలేను.. వాయిదా వేయండి'.. ఈడీకి సోనియా లేఖ
కరోనా అనంతర సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరుకావడాన్ని వాయిదా వేయాలని సోనియా గాంధీ.. ఈడీ అధికారులను కోరారు. ఈ మేరకు లేఖ రాసినట్లు ఆ పార్టీ నేత జైరాం రమేశ్ వెల్లడించారు.
- ఉపముఖ్యమంత్రిపై సీఎం భార్య రూ.100కోట్ల పరువు నష్టం దావా
దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాపై రూ.100 కోట్ల పరువు నష్టం వేశారు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రినికి భుయాన్.
- అఫ్గానిస్థాన్లో భూకంప విధ్వంసం- 1000 దాటిన మృతులు
అఫ్గానిస్థాన్లో సంభవించిన భూకంపానికి వెయ్యి మంది బలయ్యారు. మరో 1,500 మంది గాయపడ్డారు. 6.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.
- Virat Kohli Covid: విరాట్ కోహ్లీకి కరోనా.. అక్కడికి వెళ్లిన తర్వాతే..!
ఇంగ్లాండ్తో రీషెడ్యూల్ టెస్టు నేపథ్యంలో టీమ్ఇండియాను కరోనా భయాలు వెంటాడుతున్నాయి. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా కొవిడ్ బారిన పడినట్లు తెలుస్తోంది. అయితే అది కొద్ది వారాల కిందట అని సమాచారం.
- రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' విడుదల తేదీ ఖరారు
రవితేజ నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా విడుదల వాయిదాల పర్వానికి తెరపడింది. ఎట్టకేలకు సినిమా రిలీజ్ తేదీని ప్రకటించింది చిత్రబృందం. ఇంతకీ సినిమా విడుదల ఎప్పుడంటే?