తెలంగాణలో కొత్తగా 623 కరోనా కేసులు (Corona Cases) నమోదయ్యాయి. కొవిడ్ బారిన పడి మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కరోనా మహమ్మారి నుంచి మరో 594 మంది బాధితులు కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 8,803 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవాళ 1,12,796 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 6,47,229 మందికి వైరస్ సోకింది. వైరస్ బారిన పడి ఇప్పటివరకు 3,814 మంది మృతిచెందారు.
తెలంగాణ కేసుల సంఖ్య ఇలా ఉండగా.. భారత్‌లో మాత్రం కరోనా కేసులు భారీగా పెరిగాయి. తాజాగా 42,625 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. మరణాల సంఖ్య కూడా స్వల్పంగా పెరిగింది. మరో 562 కొవిడ్ బలయ్యారు. కొత్తగా 36,668 మంది వైరస్ నుంచి కోలుకోగా..రికవరీ రేటు 97.37 శాతానికి చేరింది.
పొరుగు రాష్ట్రం ఏపీలో చూస్తే.. కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 85,822 మంది నమూనాలు పరీక్షించగా 2,442 కొత్త కేసులు నమోదయ్యాయి. 16 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 2,412 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 20,184 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది.
ఇదీ చూడండి: