ETV Bharat / city

తొలి దశలో 517 పంచాయతీలు ఏకగ్రీవం.. చిత్తూరులోనే అత్యధికం - ఏపీ పల్లె పోరు

పంచాయతీ పోరులో ఏకగ్రీవాలపై స్పష్టత వచ్చింది. 12 జిల్లాల్లో మొత్తం 3,249 గ్రామాలకుగానూ... 517 చోట్ల పోటీ లేకుండానే విజయం ఖరారైంది. కొన్ని పంచాయతీల్లో అభ్యర్థులు చివరి క్షణంలో నామినేషన్లు ఉపసంహరించుకోగా.. మరికొన్ని చోట్ల ఒప్పందాలు కుదిరాయి. ఏకగ్రీవాల్ని మినహాయిస్తే తొలిదశలో 2,732 పంచాయతీల్లో పోటీ నెలకొంది.

uanimous in ap panchayat election
ఏపీ పంచాయతీ ఎన్నికలు 2021
author img

By

Published : Feb 5, 2021, 4:08 AM IST

Updated : Feb 5, 2021, 10:22 AM IST

తొలి దశలో 517 పంచాయతీలు ఏకగ్రీవం

తొలిదశ పల్లెపోరులో ఎన్నికలు జరుగుతున్న 3,249 పంచాయతీల్లో 15.91 శాతం పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 12 జిల్లాల్లో 468 మంది వైకాపా మద్దతుదారులు, 22 మంది తెలుగుదేశం సానూభూతిపరులు, 27 మంది స్వతంత్రులు సర్పంచులుగా ఏకగ్రీవమయ్యారు.

చిత్తూరు జిల్లా@ 114

చిత్తూరు జిల్లాలో 454 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనుండగా ఏకంగా 114 చోట్ల సర్పంచులు ఏకగ్రీవమయ్యారు. వారిలో 95 మంది వైకాపా బలపరిచిన వారుండగా.. 12 మంది తెలుగుదేశం సానుభూతిపరులు ఉన్నారు. మరో ఏడుగురు స్వతంత్రులు పోటీ లేకుండా గెలిచారు.

గుంటూరు జిల్లాలో 67..

గుంటూరు జిల్లాలో ఎన్నికలు జరుగుతున్న తెనాలి రెవెన్యూ డివిజన్‌లో 18 మండలాల పరిధిలో 337 గ్రామాలకు గానూ 67 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 64 చోట్ల వైకాపా మద్దతుదారులు, 2 చోట్ల తెలుగుదేశం సానుభూతిపరులు, ఒకరు స్వతంత్ర అభ్యర్థి ఉన్నారు. కృష్ణా జిల్లా విజయవాడ డివిజన్‌లో 22 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.

ఉభయగోదావరి జిల్లాల్లో ఇలా...

పశ్చిమగోదావరి జిల్లాలో 41 పంచాయతీలు ఏకగ్రీవం కాగా... 35 మంది వైకాపా మద్దతుదారులు విజేతలయ్యారు. ఐదుగురు స్వతంత్రులున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 366 పంచాయతీలకు గానూ.. 30 మంది సర్పంచులుగా ఏకగ్రీవమయ్యారు. విశాఖ పరిధిలో 43 పంచాయతీల్లో పోటీ లేకుండానే విజయం ఖరారైంది. శ్రీకాకుళం జిల్లాలో తొలిదశలో 37 చోట్ల ఏకగ్రీవమయ్యాయి. నెల్లూరు జిల్లాలో 25 పంచాయతీల్లో అభ్యర్థులు పోటీ లేకుండానే గెలుపొందగా.. అందులో 23 స్థానాలను వైకాపా బలపరిచిన అభ్యర్థులు సొంతం చేసుకున్నారు. ప్రకాశం జిల్లాలో 35 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.

ఇతర జిల్లాల్లో...

కర్నూలు జిల్లాలో 52 మంది అభ్యర్థులు సర్పంచులుగా ఏకగ్రీవమయ్యారు. అనంతపురం జిల్లాలో తొలివిడతలో ఎన్నికలు కదిరి డివిజన్‌లో మాత్రమే జరుగుతుండగా.. 169 పంచాయతీల్లో కేవలం 6 ఏకగ్రీవమయ్యాయి.పలుచోట్ల ఉపసర్పంచ్ పదవితో పాటు కొన్ని వార్డులను తెలుగుదేశం మద్దతుదారులకు ఇవ్వాలనే ఒప్పందంతో సర్పంచ్‌ పదవులు ఏకగ్రీవమయ్యాయి.

నామినేషన్ల వివరాలు వెల్లడించిన సీఈసీ

రెండో దశలో దాఖలైన నామినేషన్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. 3,335 పంచాయతీల్లో సర్పంచి పదవులకు 19,399 నామినేషన్లు దాఖలైనట్టు తెలిపింది. "33,632 వార్డులకు 79,842 నామినేషన్లు దాఖలయ్యాయి. పంచాయతీల్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 2,046 నామినేషన్లు పడ్డాయి. పంచాయతీల్లో కడప, కృష్ణా జిల్లాల్లో తక్కువగా 1,079 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డుల్లో విశాఖలో అత్యధికంగా 8,619 నామినేషన్లు దాఖలు వేశారు. తక్కువగా కడప జిల్లాలో 3,492 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ రెండో దశలో దాఖలైన నామినేషన్ల పరిశీలన చేస్తాం" అని సీఈసీ తెలిపింది.

ఇదీ చదవండి:

హైకోర్టు తరలింపుపై హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వాలదే నిర్ణయం: కేంద్రం

Last Updated : Feb 5, 2021, 10:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.