ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
ముఖ్యమంత్రి జగన్‌ను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కలిశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంను కిషన్‌రెడ్డి కలుసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'త్యాగ నిరతికి ప్రతీక మొహర్రం'
మొహర్రం త్యాగ నిరతికి ప్రతీకగా నిలుస్తోందని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. తన జీవితాన్ని త్యాగం చేసిన పవిత్ర ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ వంటి అమర వీరులను మొహర్రం గుర్తు చేస్తుందన్నారు. మంచితనం, త్యాగం ఇస్లాం సూత్రాలు కాగా మానవతావాదాన్ని వెలువరించే మొహర్రం స్ఫూర్తిని అనుసరించాలన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దాడులు చేస్తే తప్ప వ్యవహారం తెలియలేదా?: సీఎం
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నకిలీ చలాన్ల అంశంపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి స్పందించారు. అవినీతి నిరోధక శాఖ దాడులు చేస్తే తప్ప నకిలీ చలానాల వ్యవహారం తెలియలేదా?.. అసలు నకిలీ చలాన్లు ఎలా వచ్చాయని అధికారులను ప్రశ్నించారు. ఇంత పెద్ద స్థాయిలో తప్పులు జరిగినా ఎందుకు తెలియలేదని నిలదీశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ఆదుకోండి'
కరోనా మిగిల్చిన నష్టం కారణంగా ప్రైవేటు ఉపాధ్యాయుల పరిస్థితి దారుణంగా మారిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకుల్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్‌కు లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాష్ట్రపతికి శస్త్రచికిత్స
భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు గురువారం ఉదయం కంటి ఆపరేషన్ (క్యాటరాక్ట్ సర్జరీ) జరిగింది. ఈ మేరకు శస్త్రచికిత్స విజయవంతమైందని రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటన విడుదలచేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జవాను వీరమరణం
జమ్ముకశ్మీర్ రజౌరీలో గురువారం జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ముష్కరుల కాల్పుల్లో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన జూనియర్ కమిషన్డ్ అధికారి (జేసీఓ) వీరమరణం పొందారు. మరో జవాను గాయాలపాలయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బాలుడ్ని కట్టేసి కొట్టిన అల్లరిమూక
బాలుడు అనే జాలి కూడా లేకుండా రెండు చేతులను తాడుతో కట్టేసి కొట్టింది ఓ అల్లరిమూక. కేవలం సైకిల్ దొంగలించాడు అనే ఆరోపణలతో చిన్నారి ప్రాణం తీసినంత పని చేశారు అక్కడున్నావారు. ఆ నేరం తాను చేయలేదని ప్రార్థించి వేడుకున్నా.. కనికరం చూపించలేదు. మట్టిలో ఈడ్చి మరి కొట్టి చిత్రహింసలు పెట్టారు. ఈ దారుణ ఘటన బిహార్‌లోని జముయీలో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పాకిస్థాన్‌లో బాంబు పేలుడు
పాకిస్థాన్‌లో భారీ పేలుడు సంభవించింది. పంజాబ్ రాష్ట్రంలోని బహవాల్నగర్ నగరంలో షియా ముస్లింలు నిర్వహిస్తున్న ఓ ఊరేగింపులో బాంబు పేలింది. రోడ్డు పక్కన జరిగిన ఈ శక్తిమంతమైన పేలుడు ధాటికి ముగ్గురు మరణించారు. 50 మంది గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- స్టేడియంలో పంటల సాగు
పాకిస్థాన్‌లోని క్రికెట్ స్టేడియాలు క్రమంగా వ్యవసాయ క్షేత్రాలుగా మారుతున్నాయి. తాాజాగా స్టేడియంలో కూరగాయ పంటలు పండించడం దీనికి అద్దం పడుతోంది. అసలు పాక్‌కు అసలు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? అక్కడ మ్యాచ్‌లు నిర్వహించకపోవడానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బండ్ల గణేశ్ షాకింగ్ కామెంట్స్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు (MAA Elections) రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే అధ్యక్ష పదవి కోసం ఐదుగురు పోటీపడుతుండగా.. ప్రకాశ్ రాజ్ ప్యానెల్లో బండ్ల గణేశ్ ఉన్నారు. తాజాగా బండ్ల మాట్లాడుతూ .. 'మా'కు అసలు బిల్డింగే అవసరం లేదన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.