ETV Bharat / city

ప్రధాన వార్తలు @5 PM

.

5 PM TOP NEWS
ప్రధాన వార్తలు @5 PM
author img

By

Published : Aug 18, 2021, 5:02 PM IST

  • సునీల్‌ యాదవ్ రిమాండ్ పొడిగింపు

వివేకా హత్య కేసు నిందితుడు సునీల్‌యాదవ్ రిమాండ్ సెప్టెంబరు 1 వరకు పొడిగిస్తూ.. జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ఆదేశాలు ఇచ్చారు. సునీల్​కు నార్కో పరీక్షలకు అనుమతివ్వాలని రెండు రోజుల కిందట కోర్టులో సీబీఐ పిటిషన్ వేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • హైకోర్టు ఆగ్రహం

దివ్యాంగుల పింఛన్‌ నిలిపివేశారన్న పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. పింఛన్‌ నిలిపివేసే నాటికి పిటిషనర్​కు రేషన్‌కార్డు లేదని ప్రభుత్వ న్యాయవాది వాదించగా..హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పింఛన్‌ కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'వైకాపా నేతలపై చర్యలు తీసుకోండి'

తెలుగుదేశం పార్టీ నాయకులపై దాడి చేసి, కులం పేరుతో దూషించిన వైకాపా నేతలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే నాగార్జున, పానుగంటి చైతన్యతోపాటు మరో 50 మందిపై గుంటూరు తూర్పు డీఎస్పీ సీతారామయ్యకి ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • జాబితా విడుదల

ఏపీపీఎస్సీ జారీ చేసిన గ్రూప్-2 లోని కోఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్​సైట్​లో ఉంచినట్టు సహకార శాఖ కమిషనర్ ప్రకటన జారీ చేశారు. apcooperation.nic.in వెబ్‌సైట్‌లో ఉద్యోగాలకు ఎంపికైన వారి తుది జాబితాను పొందుపరిచామన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మహిళలను అనుమతించాల్సిందే'

నేషనల్ డిఫెన్స్​ అకాడమీ (ఎన్‌డీఏ) పరీక్షకు మహిళలను అనుమతించాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. పరీక్షకు మహిళలను అనుమతించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కేంద్రం కీలక నిర్ణయం

దేశీయంగా పామాయిల్​ పంటను ప్రోత్సహించేందుకు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం తీసుకొచ్చిన నేషనల్​ మిషన్​ ఆన్​ ఎడిబుల్​ ఆయిల్స్​- ఆయిల్​ పామ్ పథకానికి భారీగా నిధులు కేటాయించింది. వంట నూనె అవసరాలకు విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడమే ఈ మిషన్ ముఖ్య ఉద్దేశమని కేంద్రం పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వరుస రికార్డులకు బ్రేక్​

స్టాక్ మార్కెట్ల వరుస రికార్డులకు బుధవారం బ్రేక్ పడింది. సెన్సెక్స్ (Sensex today) 163 పాయింట్లు తగ్గి.. 55,650 దిగువకు చేరింది. నిఫ్టీ (Nifty today) 46 పాయింట్ల నష్టంతో 16,600 మార్క్​ను కోల్పోయింది. ఇంట్రాడేలో మాత్రం సూచీలు నూతన గరిష్ఠాలను తాకడం గమనార్హం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • తాలిబన్లపై ధిక్కార స్వరం

అఫ్గాన్​ను ఆక్రమించుకున్న తాలిబన్లు.. తమ నిజస్వరూపాన్ని బయటపెట్టారు. అఫ్గానిస్థాన్ జాతీయ జెండాతో నిరసనకు దిగిన పౌరులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు మరణించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • టిష్యూ పేపర్​కు ఏడున్నర కోట్లా?

ప్రముఖ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు లియోనల్‌ మెస్సీ.. బార్సిలోనా క్లబ్‌ను వీడే సమయంలో భావోద్వేగంతో కంటనీరు పెట్టిన దృశ్యం గుర్తుందా? ఆ సమయంలో మెస్సీ ఉపయోగించిన టిష్యూ పేపర్ ప్రస్తుతం వేలానికి వచ్చింది. ఈ వేలంలో దానికి లభించిన ధర తెలిస్తే షాక్ అవుతారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • స్టార్ హీరో సంచలనం

ప్రముఖ హాలీవుడ్ చిత్రం 'జేమ్స్​బాండ్' ఫేమ్ డేనియల్ క్రెయిగ్.. సంచలన ప్రకటన చేశాడు. సినిమాల ద్వారా తను సంపాదించిన వేలకోట్ల ఆస్తిలో చిల్లిగవ్వ కూడా తన పిల్లలకు ఇవ్వనని ఇటీవలే ఓ మేగజైన్ కోసం ఇచ్చిన ఇంటర్యూలో తెలిపాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.