రాష్ట్రంలో కొత్తగా 48 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కేసుల సంఖ్య 2205కు చేరింది. కర్నూలు 9, నెల్లూరు 9 , గుంటూరు 9, కృష్ణా 7, చిత్తూరు జిల్లాలో 8 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కర్నూలులో ఒకరు మృతి చెందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 803 మంది చికిత్స పొందుతున్నట్లు తెలిపింది.
ఇదీ చదవండి:విశాఖ ఘటన: బయటికొచ్చిన సీసీ పుటేజీ దృశ్యాలు