తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా 948 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 2,23,059కి చేరింది. వైరస్ నుంచి కొత్తగా 1,896 మంది బాధితులు కోలుకోగా... ఇప్పటి వరకు 2,00,686 మంది బాధితులు కోలుకున్నారు.
కొవిడ్‌తో నలుగురు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 1,275కు పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 21,098 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో 17,432 మంది బాధితులు హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 212 కేసులు రాగా.. రంగారెడ్డి జిల్లాలో 98 కేసులొచ్చాయి.
ఇదీ చదవండి:భారీ వర్షం కురిసినా.. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా..