- అలాగైతేనే అమ్మఒడి అందుతుంది : మంత్రి బొత్స
విజయనగరంలో "అమృత్" పథకంలో భాగంగా.. 196 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 1500 కేఎల్ లీటర్ల సామర్థ్యం గల వాటర్ స్టోరేజ్ ట్యాంక్‌ను విద్యాశాఖ మంత్రి బొత్స ప్రారంభించారు. గత మూడేళ్లలో 7,600 కేఎల్ లీటర్ల సామర్థ్యం గల స్టోరేజ్ ట్యాంకులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
- తిరుపతిలో జగన్ పర్యటన.. విపక్షనేతల నిర్బంధం
సీఎం జగన్ తిరుపతి పర్యటన దృష్ట్యా.. పోలీసుల ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీల నేతలను గృహనిర్బంధం చేశారు. చంద్రగిరిలో తెదేపా నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తిరుపతిలో సీఐటీయూ నేతలను, శ్రీకాళహస్తిలో జనసేన నేతలను గృహ నిర్బంధించారు.
- ఆత్మకూరులో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్..
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జిల్లాలోని మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి కుటుంబంతో కలిసి ఓటేశారు. ప్రజలందరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
- సీఎం జగన్‌ది సామాజిక న్యాయం కాదు.. సామాజిక ద్రోహం: పంచుమర్తి
ముఖ్యమంత్రి జగన్ చేసేది సామాజిక న్యాయం కాదని.. సామాజిక ద్రోహమని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ దుయ్యబట్టారు. రిజర్వేషన్లలో కోత విధించి 16,800 మంది బీసీలను రాజకీయంగా ఎదగకుండా అడ్డుకోవటం సామాజిక న్యాయమా ? అని ప్రశ్నించారు.
- జీవచ్ఛవంలా చిన్నారి.. దేవుడిపైనే ఆశలు.. ఈటీవీ భారత్ కథనంతో...
కోమాలో ఉన్న తమ చిన్నారి ఎలాగైనా కోలుకోవాలన్నది ఆ తల్లిదండ్రుల ఆశ. ఎంతో మంది వైద్యులను సంప్రదించినా ఫలితం లేదు. చివరకు కదల్లేని స్థితిలో ఉన్న బాలుడిని వెంటపెట్టుకొని చర్చికి వెళ్లారు. ఈటీవీ భారత్ ద్వారా చిన్నారి పరిస్థితి గురించి తెలుసుకున్న ఓ ఫేస్బుక్ గ్రూప్ వారికి అండగా నిలిచింది.
- 42 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు.. 'మహా' సర్కార్ మనుగడ ఇక కష్టమే!
శివసేన నేత, మహారాష్ట్ర మంత్రి ఏక్నాథ్ శిందే వెంట మొత్తం 42 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో 35 మంది శివసేనకు చెందినవారుకాగా.. మరో ఏడుగురు స్వతంత్రులు. అసోం గువాహటిలోని రాడిసన్ బ్లూ హోటల్లో వీరంతా గ్రూప్‌గా ఉన్న ఉన్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. గ్రూప్ ఫొటో కూడా దిగారు.
- వరుస భూకంపాలు.. మృత్యునిలయంగా అఫ్గాన్.. ఆత్మీయుల కోసం చేతులతోనే శిథిలాలు తవ్వుతూ..
అఫ్గానిస్థాన్‌ను వరుస భూకంపాలు కకావికలం చేస్తున్నాయి. బుధవారం 6.1 తీవ్రతతో సంభవించిన భూకంపం 1000 మందికిపైగా ప్రాణాలను బలిగొంది. 1500 మందికిపైగా గాయపడ్డారు. ప్రజలు తమ ఆత్మీయుల కోసం శిథిలాలను చేతులతో తవ్వుతూ వెతుకుతుండటం కన్నీరు పెట్టిస్తోంది.
- ఆర్బీఐ ఎఫెక్ట్.. రుణ వడ్డీ రేట్లను పెంచుకుంటూ పోతున్న బ్యాంకులు
ఆర్బీఐ పాలసీ రేట్లను పెంచిన నేపథ్యంలో.. పలు బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు రుణ రేట్లను పెంచుకుంటూ పోతున్నాయి. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ప్రాథమిక రుణ రేట్లను 60 బేసిస్ పాయింట్ల మేర పెంచింది.
- పూరి జగన్నాథ్‌పై బండ్లగణేశ్ షాకింగ్ కామెంట్స్!
దర్శకుడు పూరిజగన్నాథ్పై నిర్మాత బండ్ల గణేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి. ఏం అన్నారంటే..
- రోహిత్ శర్మ @15 ఇయర్స్.. ఆ రికార్డులు హిట్‌మ్యాన్‌కే సొంతం
అంతర్జాతీయ క్రికెట్లో ప్రవేశించి 15 ఏళ్లు పూర్తైన సందర్భంగా అభిమానులకు లేఖను విడుదల చేశారు కెప్టెన్ రోహిత్ శర్మ. ఈ ప్రయాణంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ జర్నీని తన జీవితమంతా గుర్తుంచుకుంటానన్నారు.