తెలంగాణలో కొత్తగా 397 కరోనా కేసులు, 2 మరణాలు నమోదయ్యాయి. ఆదివారం ఉదయం నుంచి ఇవాళ ఉదయం వరకు నమోదైన కేసుల వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 2,85,465కు చేరింది. వైరస్‌తో మొత్తం 1,535 మంది మరణించారు.
కొత్తగా కోలుకున్న 627 మందితో కలిపి 2,77,931 మంది వైరస్ నుంచి బయటపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,999 యాక్టివ్ కేసులు ఉండగా... 3,838మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 92 కొవిడ్ కేసులు వచ్చినట్టు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
ఇదీ చూడండి:
ఎస్‌ఈసీ ఆదేశాలు నిలిపివేయాలని పిటిషన్.. డిస్పోజ్ చేసిన హైకోర్టు