ETV Bharat / city

కేసీఆర్ డెడ్‌లైన్‌తో ఎంతమంది విధుల్లో చేరారంటే..?

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరేందుకు ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఇచ్చిన గడువు మంగళవారం అర్ధరాత్రితో ముగిసిపోయింది. రాత్రి 11 గంటల వరకు 360 మంది సమ్మతి పత్రాలు సమర్పించారు.

telangana cm kcr
author img

By

Published : Nov 6, 2019, 9:48 AM IST

కేసీఆర్ డెడ్‌లైన్‌తో ఎంతమంది విధుల్లో చేరారంటే..?

రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు విధుల్లో చేరికపై విధించిన గడువు ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా కొద్ది మంది సిబ్బంది మాత్రమే విధుల్లో చేరారు. మంగళవారం అర్ధరాత్రిలోగా విధుల్లోకి చేరకపోతే... మిగిలిన బస్సులను కూడా ప్రైవేటుపరం చేస్తామని శనివారం రాత్రి సీఎం కేసీఆర్​ వెల్లడించారు. ఈ నేపథ్యంలో మంగళవారం పొద్దుపోయేవరకు మొత్తం 360 మంది విధుల్లో చేరేందుకు లేఖలిచ్చినట్లు సమాచారం.

మొత్తం 360మంది

తిరిగి విధుల్లో చేరిన వారిలో బస్​భవన్​లోని పరిపాలన సిబ్బంది 200 మంది వరకు ఉన్నారు. గ్రేటర్​ హైదరాబాద్​ జోన్​లో 62మంది, హైదరాబాద్​ జోన్​లో 31మంది, ఇతర డిపోల పరిధిలో మిగిలిన వారు విధుల్లో చేరేందుకు ముందుకు వచ్చినట్లు తెలిసింది. ఈ సమాచారాన్ని ప్రభుత్వం, ఆర్టీసీ అధికారికంగా ప్రకటించలేదు. ఇవాళ పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు.

కార్మికుల ప్రతిజ్ఞలు

సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తోన్న నిరవధిక సమ్మె మంగళవారానికి 32వ రోజుకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వం గడువును నిర్దేశించినప్పటికీ విధుల్లో చేరేది లేదంటూ కార్మికులు పలు జిల్లాల్లో ప్రతిజ్ఞలు చేశారు. మరోవైపు హైదరాబాద్​లో కార్మిక సంఘాల ఐకాస, అఖిలపక్షం నేతలు మంగళవారం సమావేశమై భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించారు.

ఇవీ చూడండి:

ముగిసిన డెడ్​లైన్​... తర్వాత ఏం జరగనుందో..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.