ప్రస్తుత శాసనసభ సమావేశాల్లోనే మూడు రాజధానులపై చర్చించి.. బిల్లును ప్రవేశ పెడతామని సీఎం జగన్ తెలిపారంటూ సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మాదిగాని గుర్నాథం వెల్లడించారు.
బాపట్ల ఎంపీ నందిగం సురేష్, 3 రాజధానుల శిబిరం నిర్వాహకులు, బహుజన పరిరక్షణ సమితి ఉద్యమ నాయకులు గుర్నాథం, బేతపూడి సాంబయ్య, ఆదాం తదితరులు గురువారం వెలగపూడిలోని సచివాలయం వద్ద ముఖ్యమంత్రిని కలిశారు.
ఈ సందర్భంగా శాసనసభలో మూడు రాజధానుల బిల్లును మరోసారి ప్రవేశపెట్టాలని కోరుతూ సీఎంకు వినతిపత్రం అందించారు. అనంతరం గుర్నాథం మాట్లాడుతూ.. ఈనెల 21న శాసనసభలో 3 రాజధానులపై చర్చించి, బిల్లు ప్రవేశ పెడతామని సీఎం చెప్పినట్లు పేర్కొన్నారు.