ETV Bharat / city

అమరావతి కోసం విదేశీ గడ్డపై గర్జించిన తెలుగు బిడ్డలు

అనుభవరాహిత్యపు ఒక్క నిర్ణయం 29 వేల మందిని రోడ్డున పడేసింది. 6 కోట్ల మంది కలలను చిదిమేసింది. వడ్డించిన విస్తరాకు వంటి అమరావతిని కాదని ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం ...ఆంధ్రుల తరతరాల భవిష్యత్తుకు నిర్మించిన పునాదులనే కూల్చేసిన ఘట్టం. ఈ తప్పుడు నిర్ణయాన్నిచారిత్రక తప్పిదం కానీయరాదని ఆనాడే అమరావతి పోరు మొదలైంది. ఆ ఉద్యమానికి నేటికి సరిగ్గా 200 రోజులు. అందుకే అమరావతి కోసం ఆంధ్ర కదిలింది ప్రపంచం నలుమూల విస్తరించిన ప్రతి ఎన్నారై ఆంధ్రుడు మీతో నేనున్నానంటూ తన సంఘీభావం తెలిపారు. కోవిడ్ కష్టాల్లోను ఒక రాష్ట్రం ఒకే రాజధాని అంటూ ప్రపంచం మొత్తం ప్రతి మూల నుంచి అమరావతి నినాదం వినిపించింది.

200 th Day of Amravati   farmers Movement
200 రోజుల అమరావతి రైతుల ధర్నా
author img

By

Published : Jul 4, 2020, 10:56 AM IST

అమరావతి రైతుల పోరాటానికి మద్దతుగా ఎన్నారైల సంఘీభావం

అమరావతి అది పేరు కాదు... ఆంధ్రుల అణువణువునా జ్వనించే నాదం. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధానికోసం రాష్ట్రమంతా రైతుల పరిచిన పచ్చని ఉద్యమే అమరావతి. త్యాగాన్ని.. పోరాటశక్తిగా మలిచి ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో బతకాలని రైతులు నాటిన ఉద్యమం అమరావతి. ఎన్నో కష్టాలు.. నష్టాలకోర్చి ప్రతి అడుగో సమరమై.. నినాదమే శ్వాసై..దీక్షే ఆయువై 200 రోజులైంది ఈ ప్రజాఉద్యమాన్ని మొదలుపెట్టి.

ఈ ఉద్యమాన్ని అణగదొక్కాలని ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా..జైలులో పెట్టినా వెన్ను చూపని వీరుల్లా దీక్షను కొనసాగిస్తున్నారు రైతులు. ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం ...ఆంధ్రుల హక్కులను చిదిమేసే నిర్ణయం. ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజల నమ్మకాన్ని సమూలంగా కాల్చేసిన సాక్ష్యం.

ఈ తప్పుడు నిర్ణయాన్ని కళ్లకు కట్టినట్టు చూపించాలని అమరావతి పోరు మొదలుపెట్టారు రైతులు. ఆ ఉద్యమానికి నేటికి సరిగ్గా 200 రోజులు. అందుకే అమరావతి కోసం ఆంధ్ర కదిలింది. బంగరు పంటలు పండే భూములను నయా పైసా లేకుండా రాజధానికి ఇచ్చేసిన రైతుల త్యాగం వృథా కానీయకుండా ప్రతి తెలుగు బిడ్డ కదిలాడు. ప్రపంచం నలుమూల విస్తరించిన ప్రతి ఎన్నారై ఆంధ్రుడు మీతో నేనున్నానంటూ తన సంఘీభావం తెలిపారు. కోవిడ్ కష్టాల్లోను ఒక రాష్ట్రం ఒకే రాజధాని అంటూ ప్రపంచం మొత్తం ప్రతి మూల నుంచి అమరావతి నినాదం వినిపించింది.

చిరుదివ్వెలా మొదలైన ఆలోచన ఖండంతారాలకు పాకిందిలా...

వేలమంది రైతులు సుదీర్ఘంగా చేస్తున్న నిర్విరామ ఉద్యమం ఇది. వారి తెగువ, ఆవేదనకు అందరూ అండగా నిలుస్తున్నారు ఎన్నారైలు. రైతు బిడ్డలుగా ఎదిగి ప్రపంచ వ్యాప్తంగా స్థిరపడిన ఆంధ్రులు అమరావతి రైతులతో గొంతు కలిపారు. రైతుల పోరాటానికి 200 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రముఖ ఎన్నారై జయరాం కోమటి అమరావతి రైతుల పోరాటానికి మద్దతుగా నిలుద్దాం అని అమెరికాలోని ఎన్నారైలందరికీ పిలుపునిచ్చారు.

200 రోజులకు చిహ్నంగా 200 నగరాల్లో నిరసన తెలుపుదాం అనుకుంటే అది అమెరికాలోనే 230 నగరాలు అయ్యింది. మిగతా ఖండాల్లో ఉన్న ఎన్నారైలు కూడా మేము సైతం అంటూ ముందుకు వచ్చారు. చిరుదివ్వెలా మొదలైన ఆలోచన ప్రచండ భానుడిలా మారింది. దీంతో ఒక్కో ఎన్నారై అందరినీ కో ఆర్డినేట్ చేసుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 300 నగరాల్లో భారీ ఎత్తున ఎన్నారైలు కదిలివచ్చారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు అమరావతే ..మా సంకల్పం అంటూ..పోరాటానికి మద్ధతునిస్తున్నారు.

శృతి తప్పని సంఘీ భావం ..

ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే ఈ కార్యక్రమాన్ని రూపొందించడం విశేషం. ఆయా దేశాల్లో స్థానిక ప్రభుత్వాలు అనుమతించిన సంఖ్యలోనే ఎన్నారైలు ఈ కార్యక్రమంలో పాల్గొని అమరావతికి తమ సంఘీభావం తెలిపారు. వివిధ నగరాల్లోని ఎన్నారైలు స్థానిక నిబంధనలు అనుసరిస్తూ ఒక్కోచోట 15-20 మందికి మించకుండా ఈ నిరసనలో పాల్గొన్నారు.

వివిధ దేశాలలో విస్తరిస్తున్న ఆందోళనలు..

అమెరికాలోని అన్ని నగరాలతో పాటు యూకే, ఐర్లాండ్, కువైట్, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రియా, కెనడా, సింగపూర్, సౌదీ అరేబియా తదితర దేశాలలోని అనేక నగరాల నుంచి తెలుగు ఎన్నారైలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జూమ్ కాల్ ద్వారా జులై 3 రాత్రి 9 గంటలకు క్యాండిల్ లైట్ నిరసన (వెలుగు పూల సంఘీభావం) తెలుపుతూ డోంట్ కిల్ అమరావతి, బిల్డ్ అమరావతి అంటూ ఎన్నారైలు నినదించారు.

అమరావతి మన రాజధాని మాత్రమే కాదు..

అమరావతి మన రాజధాని మాత్రమే కాదు, మన భవిష్యత్తు అంటూ నినదించారు. వీరిది ఒకే కులం కాదు, ఒకే ప్రాంతం కాదు, ఒకే జిల్లా కాదు... కానీ ఒక్కటే కోరిక, ఒక్కటే సంకల్పం... అదే అమరావతి. అందరి కోరిక ఒక్కటే.... ఆంధ్రులకు గర్వకారణం అయిన అమరావతి తరతరాలు విలసిల్లే నగరంగా రూపుదిద్దుకోవాలని!

ఈ స్థాయిలో ఎన్నారైలందరూ ఏకమై నినదించడం గతంలో ఎన్నడూ జరగలేదు. ఒక రాష్ట్రం - ఒకే రాజధాని నినాదం అందరినీ ఏకం చేసింది. దీంతో కార్యక్రమం భారీగా విజయవంతం అయ్యింది. కోర్ కమిటీ.. సమన్వయం వల్లే ఇది ఈ స్థాయిలో విజయవంతం అయ్యింది.

ఇదీ చూడండి. వెలగపూడిలో రైతుల దీక్షలు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.