తెలంగాణలో కరోనా మహమ్మారి మరోసారి క్రమంగా తన ప్రాతాపాన్ని పెంచుతూ పోతోంది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. అధికారులు ఎన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నా.. ప్రజలు అంతగా ఆసక్తి చూపడం లేదు. బహిరంగ ప్రదేశాల్లోనూ మాస్క్ లేకుండా తిరుగుతున్నారు. అనుమానిత ప్రాంతాల్లో అధికారులు పరీక్షలు నిర్వహిస్తున్నారు.
వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట కడిపికొండలో 20 కరోనా కేసులు నమోదయ్యాయి. కడిపికొండలో వైద్యులు ఇంటింటికి వెళ్లి కరోనా పరీక్షలను చేస్తున్నారు. కడిపికొండలో ఒకే ఇంట్లో 13 మందికి కరోనా నిర్ధరణ అయింది. అక్కడి ప్రజలు భయాందోళనలో ఉన్నారు.
ఇదీ చదవండి: