ETV Bharat / city

ప్రధానవార్తలు@1pm

.

1pm top news
ప్రధానవార్తలు@1pm
author img

By

Published : Aug 31, 2022, 12:59 PM IST

  • కాణిపాకంలో వైభవంగా వినాయక చవితి వేడుకలు

చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వినాయక చవితి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయాన్ని అందంగా పుష్పాలతో అలంకరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • చవితి మండపం వద్ద వేద విద్యార్థి మృతి.. ఎక్కడంటే..?

ఉల్లాసంగా వినాయకుడి పండుగ జరుపుకోవాలనుకున్నారు. నిత్యం వేదాలు వల్లించే ఆ విద్యార్థి... అందరితో కలిసి విగ్రహ ప్రతిష్ఠకు ఏర్పాట్లు చేస్తున్నాడు. అంతలోనే అనుకోని ప్రమాదం అతడిని వెంటాడింది. పండుగ జరుపుకోకుండానే విద్యార్థి ప్రాణాలను గాల్లో కలిపేసింది. అసలేం జరిగిందంటే..? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రాష్ట్రానికి బల్క్‌డ్రగ్‌ పార్కు.. ఆమోదం తెలిపిన కేంద్రం

రాష్ట్రంలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. కాకినాడ జిల్లా కేపీ పురంలో పార్కు ఏర్పాటుకు ఆమోదాన్ని తెలియజేస్తూ... సీఎస్‌కు లేఖ రాసింది. వారం రోజుల్లోగా అంగీకారాన్ని తెలపాలని రాష్ట్రాన్ని కోరింది. ఈ ప్రాజెక్టుకు గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా కేంద్రం వెయ్యి కోట్ల రూపాయల ఆర్ధిక సాయాన్ని అందించనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మోదక ప్రియా.. ప్రమోద క్రియా

దేవుళ్లలో ప్రథముడు, ప్రధానుడు వినాయకుడు. దేవతలు సైతం ఆరాధించిన విఘ్నేశ్వరుణ్ణి ఆటంకాలూ అవరోధాలూ కలిగించొద్దంటూ అనునిత్యం ప్రార్థిస్తాం. భండాసుణ్ణి సంహరించి జగన్మాతకు, త్రిపురాసురుణ్ణి వధించి మహాశివుడికి తోడ్పడిన ఘననాయకుడికి నీరాజనాలు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పనిమనిషిని దారుణంగా కొట్టి చిత్రహింసలు.. భాజపా నాయకురాలు అరెస్ట్​

తన ఇంట్లో పనిచేసే మహిళను అతి దారుణంగా కొట్టి, చిత్రహింసలకు గురిచేసిన ఘటనలో ఝార్ఖండ్‌కు చెందిన భాజపా నాయకురాలు సీమా పాత్రాను రాంచీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పనిమనిషి శరీరం, ముఖంపై తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న వీడియో ఒకటి ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భోజనం పెట్టలేదని.. కూతుర్ని తలపై కొట్టి చంపిన తల్లిదండ్రులు!

పిల్లలకు అన్నీ తామై చూసుకునే తల్లిదండ్రులు వారు తప్పు చేసినా కొట్టడానికి ఆలోచిస్తారు. అంత అపురూపంగా పెంచుకుంటారు తమ పిల్లల్ని. అలాంటిది తాను చేయని తప్పుకు ఓ కూతురి ప్రాణాలు తీశారు తల్లిదండ్రులు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సోవియట్‌ యూనియన్‌ చివరి నాయకుడు మిఖాయిల్‌ గోర్బచేవ్‌ కన్నుమూత

సోవియట్‌ యూనియన్‌ చివరి నాయకుడు మిఖాయిల్‌ గోర్బచేవ్‌ (91) మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. అమెరికా నేతృత్వంలోని పశ్చిమ దేశాలు, సోవియట్‌ నేతృత్వంలోని తూర్పు దేశాలకు మధ్య ఏళ్ల తరబడి జరిగిన ప్రచ్ఛన్న యుద్ధాన్ని ముగించిన వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఆయన మృతికి వివిధ దేశాల అధినేతలు సంతాపం ప్రకటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర బుధవారం తగ్గింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.300కు పైగా తగ్గి ప్రస్తుతం రూ.52,550 పలుకుతోంది. మరోవైపు కేజీ వెండి ధర రూ.600కు పైగా తగ్గింది. ప్రస్తుతం రూ.55,205 వద్ద ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పుష్ప, ఆర్​ఆర్​ఆర్​ మేనియా.. గణపయ్య ఇక తగ్గేదే లే

దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఊరూరా గణనాథులు కొలువుదీరుతున్నారు. సాధరణంగా ఈ పండగ అంటేనే వివిధ రకాల ఆకృతుల్లో గణేష్​ ప్రతిమలు మార్కెట్​లో దర్శనమిస్తుంటాయి. అందులో కొన్ని సినిమాల్లోని హీరోల పాత్రల పోలీకలతోనూ ఉంటాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్​ ఆటకు వీడ్కోలు

న్యూజిలాండ్‌ స్టార్​ ఆల్‌రౌండర్‌ కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌ బుధవారం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ''రిటైర్మెంట్‌ నిర్ణయం బాధిస్తున్నప్పటికి తప్పడం లేదు. గాయాల కారణంగా సరైన క్రికెట్‌ ఆడలేకపోతున్నానే ఫీలింగ్‌ కలుగుతుంది. ఫామ్‌లో లేను.. ఇలాంటి సమయంలో నేను రిటైర్‌ అయితే కనీసం కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.