- సంగం డెయిరీ కేసులో విచారణ వాయిదా
సంగం డెయిరీలో సోదాలను మరో వారం రోజులపాటు కొనసాగించేందుకు అనుమతివ్వాలంటూ కోర్టులో అనిశా అధికారులు గురువారం పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సోమవారానికి వాయిదా పడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- గ్రామాల్లోనూ.. కొవిడ్ మినీ సంరక్షణ కేంద్రాలు..!
గ్రామాల్లోనూ కొవిడ్ మినీ సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. కరోనా నిర్ధరణకు ఆర్టీపీసీఆర్ ద్వారా పరీక్షించే బాధ్యత పీహెచ్‌సీ డాక్టర్ కు అప్పగించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- విశాఖ: మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు
విశాఖ - తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దుల్లో ఎదురుకాల్పులు జరిగాయి. కొయ్యూరు మండలం మర్రిపాక వద్ద మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అనవసరంగా తిరిగితే.. వాహనాలు స్వాధీనం..!
కరోనా కట్టడికి విధించిన రాష్ట్ర వ్యాప్త కర్ఫ్యూను అతిక్రమించి రోడ్లపైకి వస్తున్న వారి వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కొవిడ్ మృతదేహానికి మూడు రోజులు చికిత్స
మహారాష్ట్రలోని నాందేడ్‌లో కొవిడ్-19 మృతదేహానికి మూడు రోజుల పాటు వైద్యం చేశారు డాక్టర్లు. మృతుడి భార్య నుంచి రూ. 1.40లక్షలు వసూలు చేసింది ఆస్పత్రి యాజమాన్యం. ఈ ఘటనపై విచారించిన జిల్లా కోర్టు.. ఆస్పత్రి యాజమాన్యాన్ని దోషిగా తేల్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇల్లు కూలి నలుగురు మృతి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని షమ్లీ జిల్లాలో దారుణం జరిగింది. భారీ వర్షాలకు ఇల్లు కూలి నలుగురు మృతిచెందారు. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'చైనా అంతరిక్ష కేంద్రం ప్రయోగం వాయిదా'
చైనా తన నూతన అంతరిక్ష కేంద్రం ద్వారా చేపట్టబోయే ప్రయోగాన్ని వాయిదా వేసింది. గురువారం తెల్లవారుజామున ఈ ప్రయోగం జరగాల్సి ఉండగా.. సాంకేతిక కారణాల వల్ల మిషన్ పంపడం ఆలస్యమవుతుందని చైనా మ్యాన్డ్ స్పేస్ ఓ ప్రకటనలో పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- టిక్ టాక్ ఫౌండర్ ఝాంగ్ సంచలన నిర్ణయం
టిక్ టాక్ వ్యవస్థాపకులు ఝాంగ్ యిమింగ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. మాతృసంస్థ బైట్ డాన్స్ సీఈఓ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నగ్న చిత్రంతో సంచలనం.. ఆపై రిటైర్మెంట్!
సారా టేలర్.. క్రికెట్ అభిమానులకు ఈ పేరు సుపరిచితమే. ఇంగ్లాండ్ మహిళా జట్టు వికెట్ కీపర్‌గా, అద్భుత బ్యాట్స్ఉమెన్గా ఎన్నో రికార్డులు సృష్టించింది. ఆటతోనే కాక అందంతోనూ కుర్రకారును తనవైపు తిప్పుకొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 25 వేల కుటుంబాలకు అండగా మంచు మనోజ్
నటుడు మంచు మనోజ్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. గురువారం తన పుట్టినరోజు సందర్భంగా కరోనా వల్ల ప్రభావితమైన 25వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందజేయనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.