రాష్ట్రంలో కొత్తగా 1,316 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 8,58,711కి చేరింది. తాజాగా మహమ్మారి కాటుకు మరో 11 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 6,910కి చేరింది. చిత్తూరు, కృష్ణా జిల్లాలో ఇద్దరు చొప్పున వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోగా.. అనంతపురం, గుంటూరు, తూర్పు గోదావరి, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. ఇవాళ 1,821 మంది బాధితులు కోలుకోగా.. రాష్ట్రంలో ఇప్పటివరకు 8.35 లక్షల మంది వైరస్ను జయించి క్షేమంగా ఇంటికి చేరారు. ప్రస్తుతం 16 వేల కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 75,165 కరోనా పరీక్షలు చేయగా.. ఇప్పటివరకు 94.08 లక్షల శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్లో పేర్కొంది.
ఇదీ చదవండి: