రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొంతమేర తగ్గింది. గడిచిన 24 గంటల్లో 58,835 నమూనాలను పరీక్షించగా.. 12,994 మందికి పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. తాజా కేసులతో కలిసి ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 15,93,821కి చేరింది. ఒక్క రోజు వ్యవధిలో వైరస్ బారిన పడి 96 మంది మృతి చెందగా.. ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 10,222కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,03,762 యాక్టివ్ కేసులు ఉన్నాయని, తాజాగా 18,373 మంది కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
మహమ్మారి కారణంగా అత్యధికంగా చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 14 మంది ప్రాణాలు కోల్పోగా.. కర్నూలు, విజయనగరం జిల్లాల్లో 10 మంది, అనంతపురంలో 9 మంది, తూర్పుగోదావరి,విశాఖపట్నం జిల్లాల్లో 8 మంది, గుంటూరు, కృష్ణ, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఏడుగురు, పశ్చిమగోదావరిలో నలుగురు, ప్రకాశంలో ముగ్గురు, కడప జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందినట్లు పేర్కొంది.
ఇదీ చదవండి