ETV Bharat / city

AP CORONA CASES: రాష్ట్రంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. 12,615 మందికి వైరస్

author img

By

Published : Jan 20, 2022, 4:33 PM IST

Updated : Jan 20, 2022, 5:10 PM IST

మరో 12,615 మందికి వైరస్
మరో 12,615 మందికి వైరస్

16:29 January 20

రాష్ట్రంలో కొత్తగా 12,615 కరోనా కేసులు, ఐదు మరణాలు

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య

AP CORONA CASES: రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. సంక్రాంతి వేడుకలు, ప్రయాణికుల రద్దీ, గుంపులుగా సంచరించడం వంటి కారణాలతో కొవిడ్ కేసులు పెరిగినట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 47,420 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 12,615 మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. వైరస్ కారణంగా మరో 5 మంది మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 2,338మంది వైరస్ బారిన పడ్డారు. విశాఖ జిల్లాలో 2,117, గుంటూరు జిల్లాలో 1,066, విజయనగరం జిల్లాలో 1,039, నెల్లూరు జిల్లాలో 1,012, అనంతపురం జిల్లాలో 951, కర్నూలు జిల్లాలో 884, ప్రకాశం జిల్లాలో 853, కడప జిల్లాలో 685, తూ.గో. జిల్లాలో 627 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కొవిడ్ నుంచి మరో 3,674 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 53,871 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యా శాఖ అధికారులు తెలిపారు.

దేశవ్యాప్తంగా ఒక్కరోజే 3 లక్షలకుపైగా కేసులు

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరిగాయి. మరో 3,17,523 మందికి వైరస్​ సోకింది. ఒక్కరోజులో 491 మంది మరణించారు. 2,23,990 మంది కొవిడ్​ను జయించారు.

Corona cases in India: భారత్​లో రోజువారీ కరోనా కేసులు భారీగా పెరిగాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు.. 3,17,523 కేసులు నమోదయ్యాయి. వైరస్​తో మరో 491 మంది మరణించారు. 2,23,990 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 16.41 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రికవరీ రేటు 93.69 శాతంగా నమోదైందని పేర్కొంది.

  • మొత్తం కేసులు: 3,82,18,773
  • మొత్తం మరణాలు: 4,87,693
  • యాక్టివ్ కేసులు: 19,24,051
  • మొత్తం కోలుకున్నవారు: 3,58,07,029

Omicron Cases In India

దేశంలో ఒమిక్రాన్​ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 28 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 9,287కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Vaccination in India

భారత్​లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. బుధవారం ఒక్కరోజే 73,38,592 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,59,67,55,879కు చేరింది.

మార్చి నెలకల్లా..

మార్చి నెలకల్లా కరోనా మహమ్మారి ఎండమిక్‌గా మారనుందని ఐసీఎంఆర్‌కు చెందిన వైద్య నిపుణుడు సమీరన్ పాండా అంచనా వేశారు. 'మనం మన రక్షణ కవచాల(కొవిడ్‌ నిబంధనలను ఉద్దేశిస్తూ) విషయంలో అశ్రద్ధ వహించకుండా ఉంటే, కొత్త వేరియంట్లు పుట్టుకురాకపోతే.. మార్చి 11 కల్లా కరోనా వైరస్ ఎండమిక్‌గా మారనుంది. డెల్టా వేరియంట్‌ను ఒమిక్రాన్‌ను భర్తీ చేస్తే.. కొవిడ్ ఎండమిక్‌గా మారుతుంది. కొత్త వేరియంట్ పుట్టుకురాకపోతే ఆ అవకాశం ఉంటుంది' అని పాండా అభిప్రాయపడ్డారు.

అంతర్జాతీయంగా..

corona cases in world: ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 34,56,592 మందికి కరోనా సోకింది. 8,814 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 33,91,90,402కి చేరగా.. మరణాలు 55,83,277కు పెరిగింది.

ఇదీ చదవండి:

గోరఖ్​పుర్​లో యోగిపై 'భీమ్​ ఆర్మీ' ఆజాద్ పోటీ

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

Last Updated : Jan 20, 2022, 5:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.