ETV Bharat / city

ఏపీ ప్రధానవార్తలు@11am

author img

By

Published : Sep 6, 2022, 10:58 AM IST

.

11am top news
ఏపీ ప్రధానవార్తలు@11am
  • వానాకాలంలో మండుటెండ, ఉక్కపోత

రాష్ట్రంలో గత వారం రోజులుగా సాధారణానికి మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణంలో తేమశాతం పెరగడంతో ఎండ వేడి పెరుగుతోంది. ఉక్కపోత కారణంగా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అమ్మకానికి జగనన్న ఇళ్ల స్థలాలు!

రాష్ట్రంలో పలు చోట్ల జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలను లబ్ధిదారులు విక్రయానికి పెడుతున్నారు. పేదలకు ఇచ్చిన స్థలాలు, ఇళ్లు పదేళ్ల వరకు అమ్మకూడదనే నిబంధన ఉండటంతో అనధికారికంగా ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం లేఅవుట్‌లో రూ.2 లక్షలకు ఓ లబ్ధిదారుడి నుంచి స్థలాన్ని కొనుగోలు చేసిన రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి దాన్ని రూ.2.50 లక్షలకు అమ్మకానికి పెట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ప్రాణాలు తోడేస్తున్న అతివేగం

అతి వేగం ప్రాణాలను తీస్తోంది. ఒకరి నిర్లక్ష్యం పలువురి ప్రాణాలు పోవడానికి కారణమవుతోంది. ఫలితంగా ఎన్నో కుటుంబాలకు కడుపు కోత మిగులుతోంది. మితిమీరిన వేగంతో వాహనాలు నడపడంతోనే ఎక్కువ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పలువురు విగతజీవులవుతున్నారు. కొందరు శాశ్వత వికలాంగులుగా మారుతున్నారు. విజయవాడ నగరంలో ఏటేటా రోడ్డు ప్రమాదాలు పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పాస్​లు ఉన్నా లోనికి రానివ్వలేదు..

ఉపాధ్యాయ దినోత్సవం రోజున టీచర్లకు అవమానం జరిగింది. రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా సత్కారం చేయడానికి విజయవాడలో సోమవారం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొనేందుకు అవార్డు గ్రహీతలతో పాటు పలు జిల్లాలకు చెందిన కొంతమంది ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులకు పాస్‌లు ఇచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దిల్లీ లిక్కర్ స్కామ్​పై ఈడీ నజర్.. హైదరాబాద్​ సహా 30 ప్రాంతాల్లో సోదాలు

దిల్లీ ప్రభుత్వ మద్యం కుంభకోణం ఆరోపణల కేసులో ఎన్ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ దేశవ్యాప్త దాడులు చేపట్టింది. దేశంలోని 30 ప్రదేశాల్లో సోదాలు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దిల్లీతో పాటు ఉత్తర్​ప్రదేశ్, పంజాబ్, హరియాణ, తెలంగాణ, మహారాష్ట్ర సహా పలు ప్రాంతాల్లో ఈ దాడులు కొనసాగుతున్నాయని వెల్లడించాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భారీగా తగ్గిన కొవిడ్ కేసులు.. మరో 4,417 మందికి పాజిటివ్

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. సోమవారం నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు 4,417 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయింది. 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజులో 6,032 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.69 శాతంగా ఉంది. యాక్టివ్​ కేసులు 0.12 శాతం వద్ద స్థిరంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బెంగళూరు టెకీలకు వరద కష్టాలు.. ట్రాక్టర్లు ఎక్కి ఆఫీసుకు..

కర్ణాటకను వరద కష్టాలు వీడటం లేదు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం వల్ల బెంగళూరులో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాక్టర్లపై ప్రయాణిస్తూ ఆఫీసులకు వెళ్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పండగొచ్చేస్తుంది.. అమెజాన్, ఫ్లిప్​కార్ట్​ బంపర్​ ఆఫర్లు..

వచ్చే నెలలో దసరా పండగ ఉన్న నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలైన అమెజాన్​, ఫ్లిప్​కార్ట్ ఆఫర్ల పండగకు సిద్ధమయ్యాయి. 'గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌' పేరిట అమెజాన్ సేల్స్ నిర్వహించనుండగా, 'బిగ్ బిలియన్​ డేస్' పేరిట ఫ్లిప్​కార్ట్ ముందుకు రానుంది. వివిధ కంపెనీల మొబైళ్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులను తక్కువ ధరకే ఈ సేల్స్‌లో సొంతం చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • విజయ్​ దళపతి వర్సెస్​ ఇండియా పాక్​ మ్యాచ్‌.. ఈ రెండింటికి లింక్​ ఏంటబ్బా?

సోషల్‌ మీడియా ప్రస్తుతం సమాజాన్ని బాగా ప్రభావితం అంశం. ముఖ్యంగా మీమ్స్​.. యువతను ఎక్కువగా ఆకర్షడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అసలు సోషల్‌ మీడియాలో మీమ్స్‌ పేజీలదే హవా. అయితే మీమర్స్‌ తీసుకునే అంశాలు ఒక్కోసారి నెటిజన్లను గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఏ విషయంలో ఎవరిని ట్రోల్‌ చేస్తున్నారనే విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నాదల్​కు షాక్​.. ఆ కుర్రాడి చేతిలో ఘోర పరాజయం

ఈ ఏడాది జరిగిన వింబుల్డన్ 2022లో సెమీస్​కు ముందే గాయం కారణంగా ఆ టోర్నీ నుంచి తప్పుకున్న స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్.. తన ఆశలన్నీ యూఎస్ ఓపెన్‌పైనే పెట్టుకున్నాడు. కానీ ఇప్పుడతడకి నిరాశే మిగిలింది. ప్రస్తుతం జరుగుతున్న యూఎస్​ ఓపెన్​లో నాలుగో రౌండ్​లో అమెరికాకు చెందిన ఫ్రాన్సిస్ టోయాఫే చేతిలో ఘోరంగా ఓటమి పాలయ్యాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.