ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 11 AM - ap top ten news

..

11AM TOP NEWS
ప్రధాన వార్తలు @ 11 AM
author img

By

Published : Jun 3, 2022, 10:58 AM IST

  • రాష్ట్రం పరువు తీసే నిబంధన అది.. సిగ్గు చేటు : చంద్రబాబు
    టెండర్ల నిబంధనల్లో కాంట్రాక్టర్లు కోర్టుకు వెళ్లకూడదన్న నిబంధనపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అసమర్థ పాలనకు నిదర్శనమని ధ్వజమెత్తారు. ఈ నిబంధన రాష్ట్ర పరువు తీసేలా ఉందని మండిపడ్డారు. జగన్‌ మూడేళ్ల రివర్స్ పాలనతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కివెళ్లిందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. లక్షన్నర కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉంటే.. దాని ప్రభావమెంతో ఆలోచించారా? అని ధ్వజమెత్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కొనసాగుతున్న పెద్దపులి అలజడి.. వేటాడిన ఆవు వద్దకు మళ్లీ వచ్చింది!
    Tiger in kakinada: కాకినాడ జిల్లాలో పెద్దపులి అలజడి ఇంకా కొనసాగుతూనే ఉంది. జనావాసాలకు దగ్గరగా పులి సంచరిస్తుండడంతో.. సమీప ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పట్టుకొని తిరుగుతున్నారు. ప్రత్తిపాడు మండలం పొదురుపాక సమీపంలు తిరుగుతున్న పులి.. 12 రోజులుగా గాలిస్తున్నా చిక్కకుండా అధికారులను ​ ముప్పు తిప్పలు పెడుతోంది. జనాలను హడలెత్తిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • "మీరు చెప్పినట్లే చేశాను.. ఇప్పుడు మాట మార్చొద్దు.. నిజం చెప్పండి"
    CONFLICT: పంట పొలాలకు వెళ్లేందుకు రైతులు రెండు చెరువుల మధ్యలో నుంచి ఏర్పాటుచేసుకున్న బాటను రెవెన్యూ సిబ్బంది పొక్లెయిన్‌తో గుంతలు పెడుతుండటాన్ని సర్పంచి, స్థానికులు అడ్డుకున్నారు. ఈ విషయమై ఆర్‌ఐపై తహసీల్దారు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. ‘మీరు చెప్పినట్లే చేశాను. ఇప్పుడు మాట మార్చొద్దు. నిజం చెప్పండి’ అంటూ ఆర్‌ఐ తహసీల్దారుతో వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆన్​లైన్లో సినిమా టికెట్ల అమ్మకాలు.. రూల్స్ జారీచేసిన రాష్ట్ర సర్కారు
    Movie ticket rates: టికెట్‌ ధరపై సేవారుసుము 2 శాతానికి మించి ఉండకూడదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ సినిమా నియమావళి-1970ను ప్రభుత్వం సవరించింది. ఆన్‌లైన్‌ విధానంలో టికెట్ల విక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భర్తను వదిలి 22 రోజులు సహజీవనం.. ఆపై బెదిరింపులు.. యువకుడి ఆత్మహత్య
    తన భర్తను వదిలి మరో యువకుడితో 22 రోజుల పాటు సహజీవనం చేసింది ఓ మహిళ. ఆ తర్వాత మళ్లీ తన భర్త దగ్గరకు చేరింది. ఆ తర్వాత యువకుడిని రూ.5 లక్షలు ఇవ్వకపోతే జైలులో పెట్టిస్తా అంటూ తీవ్రంగా వేధించారు ఆమె కుటుంబసభ్యులు. ఆ బెదిరింపులు తాళలేక బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. అసలేం జరిగిందంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • హైదరాబాద్​కు వస్తున్న బస్సులో మంటలు.. ఏడుగురు దుర్మరణం!
    Road Accident Karnataka: కర్ణాటక కలబురగిలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఓ లారీని ఢీకొట్టి బస్సు బోల్తాపడగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు మరణించినట్లు సమాచారం. బస్సులో డ్రైవర్​తో పాటు మరో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఉక్రెయిన్‌కు బ్రిటన్‌​ ఆయుధాలు.. శిక్షణ ఇచ్చి మరీ.. అమెరికా బాటలోనే!
    Ukriane Crisis: రష్యా సైనిక చర్యతో ఉక్కిరిబిక్కిరవుతోన్న ఉక్రెయిన్​కు ఆయుధాలు పంపిస్తామని బుధవారం.. అగ్రరాజ్యం అమెరికా ప్రకటించింది. అయితే ఇప్పుడు బ్రిటన్​ కూడా అలాంటి నిర్ణయమే తీసుకుంది. ఎం-270 లాంఛర్లను పెద్దసంఖ్యలో పంపిస్తామని, ఇవి 80 కి.మీ దూరంలోని లక్ష్యాలనూ కచ్చితత్వంతో ఛేదించగలవని వివరించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వరుసగా రెండో సెషన్​లో స్టాక్​ మార్కెట్ల జోరు.. సెన్సెక్స్​ 400 ప్లస్​
    Stock Market Live Updates: దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు వరుసగా రెండో సెషన్​లో లాభాల్లో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 540 పాయింట్లకుపైగా పెరిగి.. 56 వేల 350 ఎగువవ ట్రేడవుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • చరిత్రాత్మక సిరీస్‌పై డాక్యుమెంటరీ.. ట్రైలర్‌ విడుదల చేసిన టీమ్ఇండియా
    Teamindia Australia Gavaskar trophy: 2020-21లో ఆస్ట్రేలియా గడ్డపై భారత్‌-ఆసీస్‌ మధ్య జరిగిన బోర్డర్‌-గావస్కర్ ట్రోఫీని.. బాలీవుడ్‌ దర్శకుడు నీరజ్‌ పాండే డాక్యుమెంటరీగా రూపొందించనున్నాడు. దీనికి సంబంధించిన ట్రైలర్​ కూడా విడుదలైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • షారుక్​-అట్లీ మూవీ ఫస్ట్​లుక్ వైరల్​.. బాద్​షా గెటప్​​ సూపర్​!
    Sharukh Khan Atlee movie first look: షారుక్​ఖాన్​-అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న 'జవాన్' సినిమాకు సంబంధించిన ఫస్ట్​లుక్​ పోస్టర్​ సోషల్​మీడియాలో వైరల్​గా మారింది. ఇది అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.