ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 11 AM - ఆంధ్రప్రదేశ్ టాప్ న్యూస్

ప్రధాన వార్తలు @ 11 AM

11AM TOP NEWS
ప్రధాన వార్తలు @ 11 AM
author img

By

Published : Jul 20, 2021, 11:00 AM IST

  • నేతల గృహ నిర్భంధం

నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని.. నేడు ఉపాధి కల్పనా కార్యాలయంలో వినతి పత్రం అందజేయనున్నట్లు జనసేన పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో.. ఆ పార్టీ నేతలపై పోలీసులు ఆంక్షలు విధించారు. గుంటూరులో పలువురు జనసేన నేతలను.. బయటకు వెళ్లకుండా గృహ నిర్బంధం చేశారు. కొందరు నాయకులకు ముందస్తు నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • శ్రీవారి దర్శన టికెట్లు విడుదల

ఆగస్టు నెలకు సంబంధించిన రూ.300 కోటా టికెట్లను నేడు తితిదే విడుదల చేసింది. ఈ ఉదయం 9 గంట‌ల నుంచి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తితిదే వెబ్‌సైట్‌లో టికెట్లను అందుబాటులో ఉంచింది. రోజుకు 5 వేల టికెట్ల చొప్పున టికెట్లు విడుదల చేయనున్నట్లు తితిదే పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'నాకే ఫాలోయింగ్ ఎక్కువనుకుంటా'

చిరంజీవి, పవన్ కల్యాణ్ కన్నా తనకే ప్రజాదరణ ఎక్కువేమోనని ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. అందుకే మీడియా సంస్థలు వారిని మించి పారితోషికం ఇచ్చి తన ప్రసంగాలు ప్రసారం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌పై ఎంపీ రఘురామ కృష్ణరాజు వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నిధులిచ్చే వరకు పోరాడుతాం

పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల మేరకు నిధులు వచ్చే వరకు పార్లమెంట్​లో పోరాడుతామని వైకాపా ఎంపీలు స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా అంశంపై 267 నిబంధన కింద చర్చ చేపట్టాలని కోరుతూ వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభ ఛైర్మన్‌కు నోటీసు ఇచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మరో 30 వేల కేసులు, 374 మరణాలు

దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది. క్రితం రోజుతో పోలిస్తే 8 వేల కేసులు తక్కువగా నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం.. కొత్తగా 30,093‬ మందికి కరోనా సోకినట్లు తేలింది. మరో 374 మంది చనిపోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పీసీసీ చీఫ్ రాజీనామా

మణిపుర్​ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి గోవిందాస్ కొంతౌజం రాజీనామా చేశారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. పార్టీని అధ్యక్షుడు వీడటం చర్చనీయాంశంగా మారింది. ఆయనతో పాటు మరో 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భాజపాలో చేరే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నిషేధం పొడిగింపు

భారత్​ నుంచి వచ్చే విమానాలపై విధించిన తాత్కాలిక నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు కెనడా ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు 21 వరకు ఈ నిషేధం కొనసాగుతుందని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రోడ్డు దాటేందుకు యత్నించి.. చివరకు..

రాజస్థాన్​లోని సవాయీ మధోపుర్ జిల్లాలో వర్షాల ధాటికి నాలాలు పొంగిపొర్లడం వల్ల రోడ్లు ప్రమాదకరంగా మారాయి. షేర్​పుర్​-ఖిల్చాపుర్​ ప్రాంతంలో రోడ్డు దాటేందుకు యత్నించిన ఇద్దరు వ్యక్తులు వరదలో కొట్టుకుపోయారు. అదే సమయానికి అక్కడ ఉన్న స్థానికులు వారిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దూకుడు కొనసాగిస్తారా?

ఈ విశ్వ క్రీడల్లో కచ్చితంగా భారత షూటర్లు అత్యుత్తమ ప్రదర్శన చేస్తారు.. మిగతా క్రీడల్లో కంటే షూటింగ్‌లోనే ఎక్కువ పతకాలు వచ్చే అవకాశం ఉంది.. కనీసం ఒక్క స్వర్ణమైనా వస్తుంది.. మన యువ షూటర్లు సంచలన ప్రదర్శన చేస్తారు.. గత రికార్డును తిరగరాస్తారు.. ఇలా టోక్యో ఒలింపిక్స్‌ ప్రస్తావన వచ్చినపుడల్లా భారత షూటింగ్‌ బృందం గురించి అంచనాలు భారీగా ఉంటున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'రీమేక్‌ కథల్లో రిస్క్‌ ఎక్కువ'

విక్టరీ వెంకటేశ్ (Venkatesh) హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన చిత్రం 'నారప్ప'(Narappa). తమిళ మూవీ 'అసురన్​'కు (Asuran) రీమేక్​గా రూపొందింది. ఓటీటీ వేదికగా ఈ సినిమా విడుదలైన సందర్భంగా చిత్ర విశేషాలను తెలిపారు శ్రీకాంత్‌ అడ్డాల(Srikanth Addala). ఇందులో భాగంగా రీమే​క్​ కథల్లో రిస్క్​ ఎక్కువగా ఉంటుందని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.