- కాసేపట్లో మంత్రివర్గ సమావేశం
రాష్ట్రంలో నూతన ఐటీ విధానం అమలు సహా కీలక అంశాలపై చర్చించేందుకు.... రాష్ట్ర మంత్రివర్గం(AP Cabinet) ఇవాళ ఉదయం 11 గంటలకు భేటీ కానుంది. సచివాలయంలోని మొదటిబ్లాక్‌లో ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో కేబినెట్ సమావేశం జరగనుంది. వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు.. నిధుల సమీకరణపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఈ నెలలో బ్యాంక్ సెలవులు
వచ్చే నెలలో తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు మొత్తం ఏడు రోజుల పాటు పనిచేయవు. బక్రీద్ పండుగ సందర్భంగా జులై 21న బ్యాంకులకు సెలవు. వీటితో పాటు ఇతర సెలవు దినాలు(Bank Holidays), దేశవ్యాప్తంగా బ్యాంకుల సెలవులు ఎప్పుడెప్పుడు అనే వివరాలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ' ఆ నిధులను మళ్లించొద్దు'
దేవాదాయశాఖ నిధులను వాహన మిత్రకు మళ్లించొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి.. హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ శాఖ నిధుల్ని వైఎస్సార్ వాహనమిత్ర పథకానికి మళ్లించారంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పిల్లల ముందే దారుణం..
కడప జిల్లా ప్రొద్దుటూరులోని భగత్‌సింగ్ కాలనీలో దారుణ హత్య జరిగింది. భార్యను రోకలిబండతో మోది భర్త హత్య చేశాడు. ఈ రోజు ఉదయం గాఢ నిద్రలో ఉన్న భార్యను అతి కిరాతకంగా కొట్టడంతో ఆమె అక్కడిక్కక్కడే ప్రాణాలు కోల్పోయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 45,951 మందికి కరోనా
దేశంలో కొత్తగా 45,951 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా 60,729 మంది కోలుకోగా 817 మంది మృతిచెందారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ట్విట్టర్‌కు మరో షాక్
సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్ రోజురోజుకూ సమస్యల ఊబిలో చిక్కుకుంటోంది. తాజాగా అశ్లీల దృశ్యాలను(చైల్డ్ పోర్నోగ్రఫీ) ట్విట్టర్లో అనుమతించటంపై దిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోక్సో చట్టం ప్రకారం సంబంధిత సంస్థపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మరోమారు డ్రోన్ల కలకలం
జమ్ములో డ్రోన్ల ఘటనలు పెరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో మరోమారు డ్రోన్ల కదలికలకు కలకలం రేపాయి. కలుచక్, కుంజ్వాని ప్రాంతాల్లో బుధవారం తెల్లవారు జామును రెండు డ్రోన్లు సంచరించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఒకేసారి 50 మందికి విందు!
ఉద్యోగం పోయిందని అధైర్యపడలేదు. ఆర్థిక సమస్యలొచ్చాయని కుంగిపోలేదు. నమ్ముకున్న రంగంలో వినూత్నంగా ఆలోచించాడు. మొబైల్ రెస్టారెంట్‌కు రూపకల్పన చేశాడు. ఆయనే బంగాల్‌కు చెందిన పార్థా మండల్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కన్నీటి పర్యంతం
ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ గాయం కారణంగా వింబుల్డన్ నుంచి అర్ధాంతరంగా తప్పుకొంది. కోర్టును వీడే సమయంలో బాధతో కన్నీటిపర్యంతమైంది. ఆ వీడియోను వింబుల్డన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఫేస్మార్ఫింగ్ పోస్టర్స్ వైరల్
రామ్‌చరణ్, ఎన్టీఆర్ కలయికలో 'ఆర్ఆర్ఆర్' మంగళవారం విడుదల చేసిన కొత్త పోస్టర్ వైరల్‌గా మారింది. ఆ పోస్టర్‌ను తమకిష్టమైన హీరోలు, క్రికెటర్లతో ఫేస్ మార్ఫింగ్ చేసి తెగ షేర్ చేస్తున్నారు నెటిజన్లు. ఆ ఫొటోలను చూసేద్దాం... పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.