తెలంగాణలో బుధవారం కొత్తగా 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 1107కు చేరిందని ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ కేసులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయని తెలిపింది. బుధవారం 20 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లగా.. ఇప్పటి వరకు డిశ్ఛార్జ్ అయిన వారి సంఖ్య 648 గా ఉంది. గత మూడు రోజులుగా ఆ రాష్ట్రంలో కరోనాతో ఎవరూ మరణించలేదు. ప్రస్తుతం 430మంది చికిత్స పొందుతున్నారని అధికారులు ప్రకటించారు.
ఇదీచదవండి.