ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 11AM - ప్రధాన వార్తలు @ 11AM

ప్రధాన వార్తలు @ 11AM

11 AM TOP NEWS
ప్రధాన వార్తలు @ 11AM
author img

By

Published : Oct 22, 2021, 11:00 AM IST

  • పోటెత్తుతున్న దీక్షాస్థలి!

మంగళగిరిలోని తెలుగుదేశం కార్యాలయంలో రెండోరోజు చంద్రబాబు నిరసన దీక్ష కొనసాగుతోంది. వైకాపా దాడులను నిరసిస్తూ 36 గంటల దీక్షకు కూర్చున్న చంద్రబాబు... రాత్రి కార్యాలయంలోని దీక్షాస్థలి వద్దే నిద్రించారు. ఉదయం 5గంటలకు లేచి కాలకృత్యాలు తీర్చుకుని వచ్చి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి రెండోరోజు దీక్ష ప్రారంభించారు.

  • CBN: సీఎం, డీజీపీలు సరిదిద్దుకోలేని తప్పు చేశారు..

ముఖ్యమంత్రి జగన్‌, డీజీపీ సవాంగ్ సరిదిద్దుకోలేని తప్పు చేశారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన ఇద్దరికీ శిక్ష పడేవరకు వదిలిపెట్టనని హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఏం చేయాలో చేసి చూపిస్తానని ప్రతినబూనారు.

  • NEET EXAM : నీట్‌ పీజీ ధ్రువపత్రాల పరిశీలన ఎప్పుడంటే?

నీట్‌ పీజీ-2021 ప్రవేశ పరీక్షకు సంబంధించిన ర్యాంకులు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 7,267 మంది విద్యార్థుల ర్యాంకులు, వారికి వచ్చిన మార్కుల స్కోర్‌ను డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో గురువారం రాత్రి ఉంచారు.

  • ఏపీ​, తెలంగాణలో పసిడి ధర ఎంతంటే?

బంగారం ధర (Gold Rate Today) శుక్రవారం స్థిరంగా ఉంది. మరోవైపు వెండి ధర (Silver price today) స్వల్పంగా తగ్గింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి..

  • సంఖ్య కాదు- దేశ సంకల్ప బలం: మోదీ

వంద కోట్ల కొవిడ్ టీకాల మైలురాయిని చేరుకున్నామని ప్రధాని మోదీ తెలిపారు. వంద కోట్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి దేశ ప్రజల కర్తవ్య దీక్ష వల్లే సాధ్యమైందని.. ఇది ప్రజల విజయమేనని స్పష్టం చేశారు.

  • దేశంలో మరో 15,786 మందికి కరోనా..

భారత్​లో కొత్తగా మరో 15,786 కరోనా కేసులు (Covid cases in India) నమోదయ్యాయి. 231 మంది ప్రాణాలు కోల్పోగా.. 18,641 మంది వైరస్​ను జయించారు.

  • Stock market news: మార్కెట్లలో జోరు- 61 వేల ఎగువన సెన్సెక్స్​

స్టాక్ ​మార్కెట్లు (Stock market news) శుక్రవారం సెషన్​ను లాభాల్లో ప్రారంభించాయి. సెన్సెక్స్​ మళ్లీ 61 వేల మార్క్​ ఎగువకు చేరింది. 200 పాయింట్ల లాభంతో 61 వేల 130 వద్ద కొనసాగుతోంది.

  • ఈ వివాదాలు ఎప్పటికీ మర్చిపోలేరు!

టీ20 ప్రపంచకప్​లో(T20 world cup 2021 schedule)భాగంగా అక్టోబర్​ 24న భారత్​-పాకిస్థాన్​ మధ్య మ్యాచ్​ జరగనుంది(pak india match 2021). అయితే ఇరు జట్ల మధ్య పోరు అంటే ఆషామాషీ కాదు. ఆటగాళ్ల దూకుడు ప్రదర్శన, కొట్లాట, కవ్వింపులు ఉంటాయి. గతంలో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్​లే ఇందుకు నిదర్శనం. ఓ సారి ఆ వివాదస్పద సంఘటనలను గుర్తుచేసుకుందాం..

  • T20 WORLD CUP: బ్రెట్‌ లీ జోస్యం.. టాప్ స్కోరర్, బౌలర్‌ వాళ్లే!

టీ20 ప్రపంచకప్‌ను (T20 world cup 2021) సొంతం చేసుకునే అవకాశం భారత్‌కే ఎక్కువగా ఉందని ఆసీస్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ బ్రెట్‌లీ విశ్లేషించాడు. ఈ టోర్నమెంట్​లో అత్యధిక పరుగులు చేసే బ్యాటర్​గా రాహుల్​.. షమి అధిక వికెట్లు తీసే బౌలర్​గా ఉంటాడని అభిప్రాయపడ్డాడు.

  • ఇంటర్నేషనల్​ ఫిల్మ్ ఫెస్టివల్..

ఇద్దరు స్టార్ డైరెక్టర్లకు సత్యజిత్ రే జీవిత సౌఫల్య పురస్కారాలను అందజేయనున్నారు. ఇంటర్నేషనల్​ ఫిల్మ్ ఫెస్టివల్​ ఆఫ్ ఇండియాలో వీటిని ప్రదానం చేయనున్నారు. ఈ వేడుకలకు తొలిసారిగా ఓటీటీ నిర్వహకులను ఆహ్వానించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.