రాష్ట్రంలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. వరుసగా ఐదో రోజూ 10వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఒక్కరోజు వ్యవధిలో 63,077 నమూనాలను పరీక్షించగా 10,603 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. 24 గంటల వ్యవధిలో 88 మంది మృతిచెందారు.
నెల్లూరు జిల్లాలో 14 మంది, చిత్తూరు 12, కడప 9, అనంతపురం 7, పశ్చిమగోదావరి 7, తూర్పుగోదావరి 6, శ్రీకాకుళం 6, కృష్ణా 5, కర్నూలు 5, విజయనగరం 5, గుంటూరు 4, ప్రకాశం 4, విశాఖపట్నం జిల్లాలో నలుగురు మరణించారు. తాజా మరణాలతో మృతిచెందిన వారి సంఖ్య 3,884కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 36,66,422 నమూనాలను పరీక్షించారు. తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 4,24,727కి చేరింది. వీటిలో 99,129 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరోవైపు అత్యధిక కేసులు తూర్పుగోదావరిలోనే నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో ఆ జిల్లాలో 1090 మందికి కరోనా సోకగా.. అత్యల్పంగా కృష్ణా జిల్లాలో 383 మంది వైరస్ బారిన పడ్డారు.
ఇదీ చదవండి
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...నలుగురు మృతి