100Cr Cheque in Hundi: తెలంగాణ అలంపూర్ జోగులాంబ ఆలయంలో హుండీ లెక్కింపు జరుగుతోంది. నాణేలను, నోట్లు, కానుకలను సిబ్బంది వేరుచేస్తూ లెక్కిస్తున్నారు. వారికి ఓ చెక్కు కనపడింది. దానిపై ‘అక్షరాలా వంద కోట్ల రూపాయలు’ అని రాసి ఉండటంతో వారు ఉలిక్కిపడ్డారు. దాన్ని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. దానిపై ఆర్మీ జవాన్ల కోసం అని రాసి ఉంది. ఇంత విరాళమా...? నిజమేనా? ఇచ్చిన వ్యక్తి ఎవరు? అని ఆలయాధికారులు ఆరా తీయగా అసలు విషయం తెలిసింది.
ఆ చెక్కు ఏపీజీవీబీ వరంగల్ శాఖకు చెందినది కాగా.. వేసిన వ్యక్తి ఖాతాలో రూ.23 వేలు మాత్రమే ఉన్నట్లు తేలింది. కొసమెరుపు ఏమిటంటే అలంపూర్ మండలానికి చెందిన అతనికి మతిస్థిమితం లేదు. ఓ ఘటనకు సంబంధించి కోర్టు ఆదేశాల మేరకు అతడిని హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ఆసుపత్రిలో పోలీసులు ఇటీవల చేర్పించారు.
ఇవీ చదవండి: