ETV Bharat / city

స్టైపెండ్‌పై 10% ఆదాయ పన్ను...పీజీ వైద్య విద్యార్థుల ఆందోళన - పీజీ వైద్యవిద్యార్థులు నిరసన

పీజీ వైద్య విద్యార్థులకు ఇచ్చే స్టైపెండ్‌పై 10% ఆదాయ పన్ను విధించారు. ఆదాయ పన్ను శాఖ నుంచి కళాశాలలకు లేఖలు రావడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

10% income tax on stipend given to PG medical students.
స్టైపెండ్‌పై 10% ఆదాయ పన్ను
author img

By

Published : Dec 20, 2020, 9:59 AM IST

పీజీ వైద్య విద్యార్థులకు అందజేసే స్టైపెండ్‌పై ఆదాయ పన్ను పడింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా 'టీడీఎస్‌' కింద 10% చెల్లించాలని ఆదాయ పన్ను శాఖ నుంచి కళాశాలలకు లేఖలు రావడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. వీరికి ప్రభుత్వం ఇటీవల స్టైపెండ్‌ పెంచింది. దీని ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి పీజీ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు నెలకు రూ.44,075, ద్వితీయ సంవత్సరం వారికి 46,524, చివరి ఏడాది విద్యార్థులకు రూ.48,973 చెల్లిస్తున్నారు. అయితే ఈ విద్యా సంవత్సరంలో కొన్నిచోట్ల విద్యార్థులకు రెండు, మూడు నెలలుగా స్టైపెండ్‌ అందలేదు. ఇదిలా ఉండగా పీజీ వైద్యవిద్యార్థుల స్టైపెండ్‌లో 10% కోత విధించాలని ఆదాయ పన్ను శాఖ నుంచి ప్రభుత్వ వైద్య కళాశాలలకు లేఖలు వెళ్లాయి. సూపర్‌ స్పెషాల్టీ కోర్సుల్లో చదివే వైద్య విద్యార్థులకూ ఈ పన్ను భారం పడింది. కర్నూలు ప్రభుత్వ వైద్యకళాశాలకు వచ్చిన లేఖలో మార్చి నెలకు సంబంధించి విద్యార్థులకు చెల్లించిన స్టైపెండ్‌పై రూ.11 లక్షలు టీడీఎస్‌ చెల్లించాలని ఆదాయ పన్ను శాఖ పేర్కొంది. ఇటువంటి లేఖలే కాకినాడ, విశాఖ, ఇతర ప్రభుత్వ వైద్య కళాశాలలకూ వచ్చాయి.

ప్రభుత్వమే న్యాయం చేయాలి

స్టైపెండ్‌పై ఆదాయ పన్ను విధించడాన్ని పీజీ వైద్యవిద్యార్థులు నిరసిస్తున్నారు. దీనిపై ప్రభుత్వమే జోక్యం చేసుకొని న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. ఆదాయ పన్ను శాఖ నుంచి వచ్చిన లేఖను అనుసరించి టీడీఎస్‌ కింద 10% కోత విధించక తప్పడం లేదని ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ సుధాకర్‌ తెలిపారు. మినహాయింపు ఇవ్వాలన్న విద్యార్థుల విజ్ఞప్తులపై ప్రభుత్వమే చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు.

ఇదీ చదవండి:

ఎంబీబీఎస్, బీడీఎస్ బీ, సీ కేటగిరీల సీట్లకు నేడు కౌన్సెలింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.