ETV Bharat / business

ఇకపై దిల్లీ, కోల్​కతా నుంచి హైదరాబాద్​కు ఫుడ్ డెలివరీ.. జొమాటో నయా సర్వీస్ - జొమాటో కొత్త సర్వీసు

Zomato Intercity legends : ప్రముఖ ఆన్​లైన్​ ఫుడ్​ డెలివరీ సంస్థ జొమాటో కొత్త సర్వీసుల్ని పరిచయం చేసింది. వినియోగదారులు ఇకపై తమకు నచ్చిన ఆహారాన్ని ఇతర ప్రాంతాల నుంచి కూడా ఆర్డర్​ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది.

Zomato launches Intercity legends Now order food from other cities

author img

By

Published : Aug 31, 2022, 2:36 PM IST

Zomato Intercity legends : ఆన్​లైన్​ ఫుడ్​ డెలివరీ సర్వీసుల్లో దూసుకెళ్తున్న జొమాటో.. ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. ఇంటర్​సిటీ లెజెండ్స్​ పేరుతో మరో కొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు మనం ఉన్న ప్రాంతంలో దొరికే ఆహార పదార్థాలను మాత్రమే ఆన్​లైన్​లో ఆర్డర్ చేసుకునే సౌకర్యం ఉండేది. అయితే.. ఇప్పుడు ఇతర ప్రాంతాల(నగరాల) నుంచి కూడా జొమాటో ద్వారా ఆహారం తెప్పించుకోవచ్చు. దీని కోసమే ఇంటర్​సిటీ లెజెండ్స్​ అనే పేరుతో కొత్త సర్వీసును పరిచయం చేసింది.

ఈ డెలివరీ సర్వీస్​తో ఇతర రాష్ట్రాలు, ప్రముఖ నగరాలకు చెందిన ప్రసిద్ధ రెస్టారెంట్​ల నుంచి బాగా ప్రాచుర్యం పొందిన వంటకాలను ఆర్డర్​ చేసుకోవచ్చని చెప్పారు జొమాటో సీఈఓ దీపిందర్​ గోయల్​. అయితే ఆర్డర్​ డెలివరీకి మాత్రం కాస్త ఎక్కువ సమయమే పట్టొచ్చని.. దూరాన్ని బట్టి ఒకరోజు కంటే ఎక్కువ కూడా అవ్వొచ్చని పేర్కొన్నారు.

''కోల్​కతా నుంచి రసగుల్లా, హైదరాబాద్​ బిర్యానీ, బెంగళూరు నుంచి మైసూర్​ పాక్​, లఖ్​నవూ నుంచి కెబాబ్​, ఓల్డ్​ దిల్లీ నుంచి బటర్​ చికెన్​, జైపుర్​ నుంచి ప్యాజ్​ కచోడీ వంటి మంచి మంచి వంటకాలను ఆర్డర్​ చేసుకోవచ్చు.''

- దీపిందర్​ గోయల్​, జొమాటో సీఈఓ

అయితే ప్రస్తుతానికి ఈ ఇంటర్​సిటీ లెజెండ్స్​ సర్వీస్​ దక్షిణ దిల్లీ, గురుగ్రామ్​కే పరిమితమైంది. అంటే అక్కడ నివసిస్తున్న వారికి మాత్రమే ఇప్పుడు ఇతర ప్రాంతాల నుంచి ఆర్డర్​ చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంది. వీరు కోల్​కతా, హైదరాబాద్​, లఖ్​నవూ, జైపుర్​, బెంగళూరు, మథుర, చెన్నై, ఆగ్రా, భువనేశ్వర్​ వంటి నగరాల నుంచి వంటకాలను జొమాటో ద్వారా ఆర్డర్​ చేసుకోవచ్చు. అయితే.. ఆ నగరాల్లో అన్ని రెస్టారెంట్​లు మనకు కనిపించవు. కొన్ని ఎంపిక చేసిన ప్రముఖ రెస్టారెంట్ల నుంచి మాత్రమే ఆర్డర్​ చేసుకోవచ్చు.

ఇతర ప్రాంతాల నుంచి ఆర్డర్​ చేసిన ఆహారం ఫ్లైట్​లో వచ్చేస్తుంది. అక్కడ ఆహారాన్ని భద్రంగా ఉంచేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు జొమాటో సీఈఓ వెల్లడించారు. ఈ సర్వీసును క్రమక్రమంగా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామని గోయల్​ స్పష్టం చేశారు. ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చాక ఈ ఆన్​లైన్​ ఫుడ్​ డెలివరీ సంస్థకు ఆదరణ మరింత పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇవీ చూడండి: యువతకు ఆదర్శం ఈ జొమాటో గర్ల్: ఓ వైపు పని.. మరోవైపు చదువు!

జొమాటో సీఈఓ బంపర్​ ఆఫర్​.. విరాళంగా ఉద్యోగులకు రూ.700 కోట్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.