ETV Bharat / business

Home Loans at Lowest Interest Rates : అతి తక్కువ వడ్డీతో.. హోమ్ లోన్ ఇస్తున్న బ్యాంకులు ఇవే..! - తక్కువ వడ్డీ రేట్లకే ఈ బ్యాంకులలో గృహరుణాలు

Banks Provide Home Loan at Lowest Interest Rates in India : మీరు సొంత ఇంటి కోసం ప్లాన్ చేస్తున్నారా? ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఇంటి నిర్మాణాలను వాయిదా వేస్తున్నారా? అయితే.. ఇది మీ కోసమే. కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీరేట్లకే హోమ్ లోన్స్ ఆఫర్ చేస్తున్నాయి. మరి, ఆ వివరాలేంటో ఇక్కడ చూడండి.

Home Loans at Cheapest Interest Rates
Home Loans
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 25, 2023, 12:13 PM IST

Banks Offers Home Loan on Lower Interest Rates : సొంత ఇల్లు కట్టుకోవాలనేది ప్రతీ ఒక్కరికి స్వప్నం. ఈ కల వాస్తవ రూపం దాల్చడానికి అందరికీ ఎదురయ్యే మొదటి ఇబ్బంది డబ్బు సర్దుబాటు. ఇలాంటి వారికోసమే.. బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలు గృహ రుణాలు అందిస్తుంటాయి. అనివార్య పరిస్థితుల్లో చాలా మంది గృహ రుణాలు తీసుకుంటున్నారు. మరి, అతి తక్కువ వడ్డీ రేట్లతో.. హోమ్ లోన్ ఇస్తున్న బ్యాంకులు ఏవో..? ఎంత మొత్తం వడ్డీ వసూలు చేస్తున్నాయో మీకు తెలుసా??

తక్కువ వడ్డీకి హోమ్ లోన్స్​ అందిస్తున్న బ్యాంకులివే..

These Banks are Providing Home Loans at Low Interest Rates :

HDFC : ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంకు.. హెచ్​డీఎఫ్​సీ(HDFC) తమ వినియోగదారులలో హోమ్ లోన్స్ కావాలనుకునే అర్హులైన రుణగ్రహీతలకు చాలా తక్కువ వడ్డీరేటుతో గృహ రుణాలు ఇస్తోంది. ఈ బ్యాంకులో హోమ్ లోన్లపై కనీస వడ్డీరేటు 8.5శాతంగా ఉండగా.. గరిష్ఠంగా 9.85శాతం వరకు ఉంది. అదనంగా ఈ లోన్​ల కోసం అనుబంధిత ప్రాసెసింగ్ ఫీజులు గరిష్ఠంగా 3వేల నుంచి 5వేల వరకు ఉన్నాయి. సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి హెచ్​డీఎఫ్​సీ అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోందనేది నిపుణుల అభిప్రాయం.

ఇండస్‌ఇండ్ బ్యాంకు : ఇండస్‌ఇండ్ బ్యాంకు(Indusind Bank) హోమ్ లోన్స్​పై 8.5% నుంచి 9.75% వరకు వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, పొడిగించిన రీపేమెంట్ కాలపరిమితి.. వినియోగదారులకు మంచ ఆప్షన్ గా ఉంది.

ఇండియన్ బ్యాంకు : పైన పేర్కొన్న బ్యాంకుల మాదిరిగానే ఇండియన్ బ్యాంకు(Indian Bank) కూడా ఆర్షణీయమైన గృహ రుణాలను అందిస్తోంది. ఈ బ్యాంక్​లో హోమ్ లోన్స్​పై ప్రారంభ వడ్డీ రేటు 8.5% ఉండగా.. గరిష్ఠ వడ్డీ రేటు 9.9%గా ఉంది.-పేమెంట్ నిబంధనలను కూడా సౌకర్యవంతంగానే ఉంటాయి.

హోమ్​ లోన్​కు అప్లై చేద్దామనుకుంటున్నారా?.. వీటిలో ఏది బెటర్​?

పంజాబ్ నేషనల్ బ్యాంకు : రెండవ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకుగా ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంకు(Punjab National Bank) కూడా పోటీతత్వ హోమ్ లోన్ ఆఫర్‌లతో గృహ కొనుగోలుదారులను ఆకర్షిస్తోంది. ఈ బ్యాంకులో ప్రారంభ వడ్డీ రేటు 8.6% ఉండగా.. గరిష్ఠ వడ్డీరేటు 9.45%గా ఉంది. PNB సొంత ఇంటి కల నెరవేర్చుకోవడానికి సరసమైన ఫైనాన్సింగ్ ఎంపికలను అందిస్తోంది. రుణగ్రహీతలకు అనుకూలమైన నిబంధనలను రూపొందించింది. రూ. 10 లక్షల నుంచి రూ. 50 లక్షల మధ్య నిధులను లోన్​ల రూపంలో అందిస్తోంది.

ఫస్ట్​ టైం 'హోం లోన్' తీసుకుంటున్నారా?.. ఈ విషయాలు మస్ట్​గా తెలుసుకోండి!

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర : బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(Bank of Maharashtra) కూడా తక్కువ వడ్డీ రేట్లకే లోన్స్ అందిస్తోంది. 8.6% నుంచి 10.3% వరకు విస్తృతమైన గృహ రుణ వడ్డీ రేట్లను ఈ బ్యాంకు అందిస్తోంది. ముఖ్యంగా మంచి రుణ నిబంధనలను పొందడం అనేది క్రెడిట్ స్కోర్‌పై ఎక్కువగా ఆధారపడి ఉంటుందని ఈ బ్యాంకు వినియోగదారులకు చెబుతోంది. ఎంత మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే, బ్యాంకులు మీకు అంతగా ఎక్కువగా రుణాలు ఇచ్చే అవకాశం ఉందని కస్టమర్లకు సూచిస్తోంది.

How To Add Bank Account In Google Pay: గూగుల్ పేలో బ్యాంక్ ఖాతా ఇలా యాడ్ చేయండి.. పిన్ అలా ఛేంజ్ చేయండి..

330 RS Deducted From SBI Account : బ్యాంక్​ అకౌంట్​ నుంచి రూ.330 కట్​ అయ్యాయా? కారణమిదే..

For All Latest Updates

TAGGED:

Home Loans
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.